వైకాపాలో 14, 15, 16 వికెట్లు డౌన్‌..!

Update: 2016-04-25 04:39 GMT
వైకాపా అధినేత వైఎస్‌ జగన్ మోహన్  రెడ్డికి రోజుకో షాక్‌ తగులుతోంది. ఓ షాక్ నుంచి కోలుకున్న వెంట‌నే మ‌రో షాక్ త‌గులుతోంది. వ‌రుస‌గా త‌న పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జంప్ చేస్తుండ‌డంతో వారిని ఆపుచేయ‌లేక జ‌గ‌న్‌ తో పాటు ఆ పార్టీ నాయ‌కులు సైతం చేష్ట‌లుడిగి చూస్తున్నారు. పార్టీ మారుతున్న వారిని నిలువ‌రించేందుకు జ‌గ‌న్ చేస్తోన్న ప్ర‌య‌త్నాలు యూజ్‌ లెస్‌ గా మారాయి. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌ బాషా శనివారం బెజవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లబోతున్నారు.

చాంద్ బాషా వికెట్ వైకాపాలో 13వ‌ది కాగా ఇక వ‌రుస‌గా 14 - 15 - 16 వికెట్లు కూడా ప‌డేందుకు రెడీగా ఉన్నాయి. క‌ర్నూలు జిల్లా నుంచి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి (శ్రీశైలం) - ప్ర‌కాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి) - విశాఖ జిల్లా నుంచి కిడారి సర్వేశ్వరరావు (అరకు) తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల‌లో కిడారిని జ‌గ‌న్ అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న టాక్ ఎప్ప‌టి నుంచో ఉంది. గిరిజ‌న ఎమ్మెల్యే అయిన త‌న‌ను జ‌గ‌న్ అస్ప‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు స‌రిక‌దా...త‌న‌కు తెలియ‌కుండానే త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వేరే గ్రూపును అధిష్టానం ప్రోత్స‌హిస్తోంద‌న్న ఆయ‌న త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోయిన‌ట్టు స‌మాచారం.

 దీంతో పార్టీ మారేందుకు వేచి చూస్తోన్న కిడారి ఎట్ట‌కేల‌కు సైకిలెక్కేందుకు రెడీ అయ్యార‌ని తెలుస్తోంది. ఇక భూమా రాజీనామాతో ఖాళీ అయిన పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌విని ఆశించి భంగ‌ప‌డ్డ గొట్టిపాటి ర‌వికుమార్ కూడా జ‌గ‌న్ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఆయ‌న కూడా బుధ‌వారం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి కూడా అదేరోజు పార్టీలో చేరుతారని కర్నూలు నేతల సమాచారం. బుడ్డా పార్టీ మారే విష‌యంపై ఇప్ప‌టికే త‌న నియోజ‌క‌వర్గంలోని పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశం నిర్వ‌హించి పార్టీ మారుతున్న‌ట్టు వారితో చెప్పిన‌ట్టు కూడా తెలుస్తోంది.

 ఈ ముగ్గురు ఎమ్మెల్యేల‌లో కిడారిని పార్టీలోకి తీసుకు వ‌చ్చేందుకు విశాఖ జిల్లాకు చెందిన అయ్య‌న్న‌పాత్రుడు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసేందుకు జ‌గ‌న్ పెద్ద ఎత్తున ప్లాన్లు వేసుకుంటున్న టైంలో జ‌గ‌న్‌ కు వ‌రుస షాకులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే జ‌గ‌న్ అవినీతి సొమ్ముతో చంద్ర‌బాబు త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్నార‌ని రాష్ర్టప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి ఫిర్యాదు చేయ‌నున్నారు.
Tags:    

Similar News