అంతరిక్షంలోకి పంపే అద్భుత అవకాశం ‘టైడ్’ సొంతం

Update: 2021-06-26 05:36 GMT
దేశంలో చాలామంది బట్టలు ఉతికే పౌడర్ ను సర్ఫ్ గా పిలుస్తారు. రిన్ సర్ఫ్ ఇవ్వండి.. ఎరియల్ సర్ఫ్ ఇవ్వండి.. టైడ్ సర్ఫ్ ఇవ్వడంటారు. నిజానికి రిన్.. ఎరియల్.. టైడ్.. ఎలా అయితే వేర్వేరు బ్రాండ్లో ''సర్ఫ్'' ఒక బ్రాండ్. తొలితరం డిటర్జెంట్ పౌడర్ గా సర్ఫ్ రావటం.. జనాల మనసుల్లో డిటర్జెంట్ పౌడర్ ను సర్ఫ్ అని సింఫుల్ గా పిలవటం అలవాటు అయ్యాక.. ఏ బ్రాండ్ అయినా సరే.. దాని పక్కన సర్ఫ్ అనే మాటను పెట్టేయటం చేస్తారు. మరి కాస్త బాగా అర్థం కావాలంటే.. బ్లండర్ మిస్టేక్ పద ప్రయోగం మాదిరి.

బ్లండర్ అన్నా.. మిస్టేక్ అన్నా ఒకటే అర్థం. తీవ్రతలో కాస్త తేడా ఉంటుంది. అంతేకానీ 'బ్లండర్ మిస్టేక్' అనే పదం ఉండదు. చాలామంది చదువుకున్న వారు సైతం ఈ పదాన్ని తరచూ వాడేస్తుంటారు. అలానే సర్ఫ్ కూడా. ఇదంతా ఎందుకంటే.. ఒక డిటర్జంట్ పౌడర్ తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లనుంది. నాసా దీన్ని ప్రత్యేకంగా పంపిస్తోంది. ఇంతకీ అదేం బ్రాండ్ అంటారా? అవాక్కయ్యారా అంటూ తెలుగు లోగిళ్లకు సుపరిచితమైన టైడ్ త్వరలోనే అంతరిక్షంలోకి వెళ్లనుంది. ఇప్పటివరకు..అంతరిక్షంలోని వ్యోమగాముల దుస్తుల మురికిని వదిలించుకోవటానికి.. ఎప్పటికప్పుడు కొత్త దుస్తుల్ని వినియోగించటమే తప్పించి.. అక్కడ ఉతుక్కోవటం లాంటిదేమీ ఉండదు.

అయితే.. రాన్రాను.. వారికి బట్టలు పంపటం కష్టంగా మారుతోంది. దీంతో.. వారి దుస్తుల్ని అక్కడే వాష్ చేసుకునేందుకు వీలుగా.. సరికొత్త సాంకేతికతను ప్రోక్టర్ అండ్ గాంబుల్ సంస్థ (పీ అండ్ జీ) సిద్ధం చేసింది. టైడ్ బ్రాండ్ మీదన వారికి అవసరమైన డిటర్జెంట్ మాడ్యూల్ ను పంపనున్నారు. ఈ సంస్థకు చెందిన పరిశోధకులు నాసా సైంటిస్టులతో కలిసి రూపొందించిన డిటర్జెంట్ ను అంతరిక్షంలో పంపుతున్నారు. అలా.. తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లే డిటర్జంట్ బ్రాండ్ గా టైడ్ నిలుస్తోంది.
Tags:    

Similar News