నిర్భయ దోషుల్ని ఉరి తీసేందుకు జైలుకు వచ్చేసిన తలారి

Update: 2020-01-31 04:52 GMT
దేశ వ్యాప్తంగా సంచలనమైన నిర్భయ ఉదంతంలో.. నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరి ఒకటి ఉదయం 6 గంటలకు ఉరి శిక్షను అమలు చేయాల్సి ఉంది. ఉరి తీసేందుకు అవసరమైన తాడును ఇప్పటికే సిద్ధం చేయగా.. ఉరిశిక్షను అమలు చేసేందుకు మీరట్ కు చెందిన తలారీ పవన్ జిల్లాద్ తీహార్ జైలుకు చేరుకున్నారు.

ఉరిశిక్షకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించనున్నారు. తలారీగా మూడో తరానికి చెందిన పవన్.. శిక్షను అమలు చేసేందుకు వీలుగా తీహార్ జైలు ప్రాంగణంలోనే ఉంటారని.. తాడు.. దాని బలాన్న పరీక్షించే పనులతో పాటు.. ఏర్పాట్లను తనిఖీ చేస్తారని చెబుతున్నారు.

నిర్భయ దోషులు నలుగురికి ఉరిశిక్షను అమలు చేయటానికి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుంటే.. అనుకున్న దాని ప్రకారం ఉరిశిక్షను అమలు చేస్తారని చెబుతున్నారు. న్యాయసూత్రాల్లోని అవకాశాల్ని తమకు తగ్గట్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్న దోషుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే దోషుల్లో ఒకరు రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడాల్సి ఉంది. మరోవైపు నిర్భయ దోషుల్లో మరొకరైన అక్షయ్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. వారు పిటిషన్ ను తిరస్కరించటం తెలిసిందే. అనుకున్న దాని ప్రకారం రేపు (శనివారం) ఉరిశిక్ష ను అమలు చేస్తారా? లేక ఆపుతారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News