సెక్స్టింగ్ వివాదం ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ కి టిమ్ పైన్ గుడ్‌ బై !

Update: 2021-11-19 06:36 GMT
ఆస్ట్రేలియా క్రికెట్‌ లో మరోసారి కలకలం రేగింది. సెక్స్టింగ్ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న 36 ఏళ్ల టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ రాజీనామా చేశాడు. హోబర్ట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పైన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. సహోద్యోగికి వరుసగా సెక్స్టింగ్ చేసినందుకు గాను పైన్‌ పై క్రికెట్ ఆస్ట్రేలియా దర్యాప్తు జరిపింది.

తన రాజీనామాను గవర్నింగ్ బాడీ ఆమోదించినట్టు టిమ్ పేర్కొన్నాడు. మార్చి 2018లో పైన్ ఆస్ట్రేలియా జట్టు 46వ టెస్టు కెప్టెన్‌ గా బాధ్యతలు చేపట్టాడు. ఆస్ట్రేలియా పురుషుల జట్టు టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని తాను నిర్ణయించుకున్నానని, ఇది చాలా కఠినమైన నిర్ణయమేనని అన్నాడు.

అయితే తనకు, తన కుటుంబానికి, క్రికెట్‌ కు ఇది సరైన నిర్ణయమేనని చెప్పుకొచ్చాడు. నాలుగేళ్ల క్రితం అప్పటి సహోద్యోగితో సందేశాలను పరస్పరం పంచుకున్నట్టు చెప్పాడు. తాజా నిర్ణయం అందులో భాగమేనన్నాడు. ఈ ఘటనకు సంబంధించి జరుగుతున్న విచారణలో తాను బహిరంగంగానే పాల్గొన్నట్టు చెప్పాడు.

క్రికెట్ ఆస్ట్రేలియా నియమావళిని ఉల్లంఘించలేదని విచారణలో తేలిందని, తాను నిర్దోషిగా బయటపడినప్పటికీ, ఆ సమయంలో ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసినట్టు చెప్పాడు. ఈ రోజు కూడా అదే పనిచేస్తున్నానన్నాడు. ఈ ప్రైవేట్ టెక్స్ట్ ఎక్స్‌చేంజ్ పబ్లిక్‌ గా మారబోతోందని ఇటీవల తెలుసుకున్నట్టు చెప్పాడు.

అప్పట్లో తాను తన భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడానని, వారి క్షమాపణ, మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పైన్ వివరించాడు. ఈ ఘటన తమను వేధించినప్పటికీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా చేసినట్టుగానే ఇకపైనా జట్టుపై పూర్తిగా దృష్టి పెడతానని అన్నాడు. ఈ ఘటన తమ ఆట ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు క్షమించాలని వేడుకున్నాడు.

కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం సరైన నిర్ణయమేనని అనుకుంటున్నానని, ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందన్నాడు. యాషెస్ సిరీస్‌ కు ముందు జట్టుకు తన నిర్ణయం ఆటంకంగా మారకూడదని భావిస్తున్నట్టు చెప్పాడు. ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు నాయకత్వం వహించడం తన క్రీడా జీవితంలోనే గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పాడు. సహచరుల మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నాడు.

మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్-కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌ క్రాఫ్ట్ పాల్గొన్న దక్షిణాఫ్రికాలో బాల్ ట్యాంపరింగ్ జట్టు నుంచి సస్పెండ్ అయిన తర్వాత వికెట్ కీపర్-బ్యాటర్ జట్టులో చేరిన పైన్ తర్వతా టెస్ట్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు.సెక్స్టింగ్ అంటే స్త్రీ, పురుషుడు వారికి సంబంధించిన నగ్న ఫొటోలు, వీడియోలు ఒకరికొకరు షేర్ చేసుకోవడం. శృంగారానికి సంబంధించిన సందేశాలు పంపుకోవడం కూడా సెక్స్టింగ్ కిందికి వస్తుంది.
Tags:    

Similar News