లాక్ డౌన్: ఈ హాబీలతో టైంపాస్ చెయ్యొచ్చు

Update: 2020-04-13 16:38 GMT
కారణాలు ఏమైనప్పటికీ మనం ప్రస్తుతం లాక్ డౌన్లో వున్నాం. ఈ సమయంలో ఎవరు సంతోషంగా గడపగలరు అంటే.. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ హాబీ ఉన్నవాళ్లు. నాకు ఒక ఇంట్రెస్టింగ్ హాబీ ఉంది.. "నాలుగు ముక్కలు బిగించి నలుగురికి ఫోన్ చేస్తా.. ఇంకో రెండు బిగించి ఒళ్ళు తెలియకుండా తైతక్కలాడతా" అనే వీలు కూడా లేదు. ఎందుకంటే "సారీ నో ఛాన్స్."

హాబీలు అంటే పైసా ఆదాయం లేని హాబీలు కాదు. పనికొచ్చేవి.. మనకైనా.. మరో నలుగురికైనా. పాతకాలం నాటి హాబిలైన.. పుస్తకాలు చదవడం.. చిత్రలేఖనం.. లాంటివి నిజంగా ఉంటే అంతకంటే అదృష్టం మరొకటి లేదు. ఎందుకంటే పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారికి చదవాలంటే పుస్తకాలే ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు ఫోన్ లోనే పది రకాల యాప్స్ ఉన్నాయి. వాటి మీద పడిపోవచ్చు. ఇక చిత్రలేఖనం అంటారా.. ఇంట్లో పెయింటింగ్ కి కావలసిన సరంజామా ఉంటే సరే.. లేకపోతే ఫోన్లో నో.. లాప్ టాప్ లోనో మీ పని మొదలు పెట్టండి. ఎన్ని బొమ్మలు కావాలంటే అన్ని బొమ్మలు గీయండి. కావాలంటే యూట్యూబ్ లో ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. పైసా ఖర్చు లేకుండా ఎంచక్కా ఫాలో అయిపోండి.

ఒకవేళ ఎక్సర్ సైజులు చేసి ఇ ఫిట్నెస్ పెంపొందించుకోవాలని అనుకుంటే దానికి తగ్గ వీడియోలు యూట్యూబ్ లో చాలానే ఉన్నాయి. ఇంట్లోనే ఉంటూ ఎటువంటి e lokmat అవసరం లేకుండా చేసే ఫ్రీ హ్యాండ్ ఎక్సర్ సైజులు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ లాక్ డౌన్ పూర్తయి తిరిగి ఆఫీస్ వెళ్ళే సమయానికి.. మీరు కొమరం భీమ్ లాగానో.. అల్లూరి సీతారామరాజు లాగానో ఫిట్ గా మారవచ్చు.

మాకు ఇలాంటి హాబీలు వద్దు. సినిమాలే చూస్తామంటే.. వరసపెట్టి సినిమాలు చూసేయండి. తెలుగు సినిమాలు మాత్రమే కాదు ఇంటర్నేషనల్ సినిమాలు కూడా చూస్తామంటే.. ఐ.ఎమ్.డీ.బి సైట్ లో పాపులర్ సినిమాల లిస్టు ఉంటుంది.. హైయెస్ట్ రేటింగ్ ఉన్న సినిమాల లిస్టు ఉంటుంది. లిస్టు తీసుకుని.. ఇంట్లో ఉన్న ఓటీటి ఆప్ అంతు చూసేయండి. వాటిలో ఆ సినిమాలు లేకపోతే తప్పు..ఒప్పు అని ఆలోచించకుండా.. టొరెంట్ వెబ్సైట్ల మీద పడిపోండి.

ఇవన్నీ కాకుండా కొంతమందికి కొన్ని విషయాలు నేర్చుకోవాలని ఉంటుంది. ఉదాహరణకు కొంతమందికి ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించాలని మనసులో తపన ఉంటుంది. కానీ ఉద్యోగాల కారణంగా.. తీరిక లేని పనుల ఒత్తిడితో ఆ దిశగా కృషి చేయరు. నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే.. యూట్యూబ్ కంటే మంచి గురువు మరొకరు ఉండరు. తెలుగులో మాట్లాడుతూనే ఇంగ్లీష్ నేర్పించే చానల్స్ తో పాటు.. ఇంగ్లీషులోనే మాట్లాడుతూ ఇంగ్లీష్ నేర్పించే యూట్యూబ్ ఛానల్స్ వందల్లో ఉన్నాయి. యూట్యూబ్ అనగానే అదేదో పిచ్చి పిచ్చి.. మిస్ లీడింగ్ న్యూస్ లు ఉండే దరిద్రం అనుకోవాల్సిన పనిలేదు. మనం చూసే చూపును బట్టే యూట్యూబ్ ఉంటుంది.

ఇంగ్లీష్ ఒక్కటే కాదు మీకు నచ్చిన భాషను నచ్చినట్టు నేర్చుకునే అవకాశం కల్పించే యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. అంతేకాదు మీకు నిజంగా మరేదైనా సబ్జెక్టుపై పట్టు సాధించాలని ఇంట్రెస్ట్ కనుక ఉంటే.. దానికి సంబంధించిన ఛానల్స్ చూడొచ్చు. నేర్చుకోవచ్చు.

ఇవే కాదు.. మతం అనగానే చాలామందికి జోక్ అయిపోయింది కానీ.. నిజంగా మతం గురించి జోక్ చేసే వారెవరికీ మతం గురించి బేసిక్స్ కూడా తెలియవు. నిజంగా ఎవరికైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి అనిపిస్తే మత గ్రంథాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. అది హిందూ మత గ్రంథమైన అయ్యుండొచ్చు.. లేకపోతే క్రైస్తవ మత గ్రంథమైన ఉండొచ్చు.. లేకపోతే ముస్లిం మత గ్రంథమైన అయి ఉండొచ్చు. నిజానికి క్లిష్ట సమయంలో అయిన వాళ్ళు అందరూ మనకు వీలైనంతగా హ్యాండ్స్ ఇస్తారు గాని.. నిజంగా ధైర్యం ఇచ్చేది ఆ కంటికి కనపడని భగవంతుడే. దేవుడి నిజంగా నమ్మకపోయినా.. ఎలా బ్రతకాలి అనే విషయంలో మత గ్రంథాలలో ఎన్నో పాఠాలు ఉంటాయి. ఎవరో మత గ్రంధాలను వక్రీకరించే కొందరు జఫ్ఫాల మాటల్లో కాకుండా మనమే వాటిని నిజంగా చదివితే.. అందులో ఉండే ఒక్క శాతం అయినా అర్థం అయితే.. నిజంగా మనం మనుషులుగా మారే అవకాశం ఉంటుంది.

మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ సమాజం మనపై వీలైనంతగా నెగిటివిటీ రుద్దుతూ ఉంటుంది. చెడును గ్లోరిఫై చేస్తూ.. మంచిని తక్కువ చేస్తూ ప్రపంచం తలకిందులు అయిపోయిందని గగ్గోలు పెడుతూ ఉంటుంది. కానీ నిజానికి అలా ఏం లేదు. అసలు ఈ విషయం అర్థం కావాలంటేనే ముందుగా పాజిటివ్ దృక్పథాన్ని అలవరుచుకోవాలి.. మనం ప్రపంచాన్ని చూసే విధానం మార్చుకుంటే అప్పుడు కానీ ఈ ప్రపంచంలో ఉండే మంచి మనకు కనపడదు. కరోనా చెడ్డది. కానీ ఈ సమయంలో ప్రాణాలకు తెగించి మరీ తోటి వారి కోసం శ్రమించే హెల్త్ కేర్ వర్కర్స్.. మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్స్.. పోలీసులు.. వీళ్ళందరూ చేసే సేవలను తప్పనిసరిగా మనం గుర్తించాలి.

ఇక ఈ సమయంలో కోట్లకొద్దీ విరాళాలు ఇచ్చే మంచి మనసు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక రేప్ న్యూస్ ను.. తదనంతర పరిణామాలను గంటల కొద్ది.. రోజుల కొద్ది.. నెలల కొద్ది.. ఏళ్ళ కొద్ది చూసే మనం.. వీరందరూ చేసే మంచి మాత్రం ఒక రోజులో మర్చిపోతాం. ఒక రేపిస్ట్ గురించి ఏళ్ల తరబడి మాట్లాడే మనం.. ఒక అక్షయ్ కుమార్.. సోను సూద్ లాంటి వారు చేసే గొప్ప సాయాలను ఏళ్ల తరబడి ఎందుకు మాట్లాడం? కారణం నెగిటివిటీ మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో కనీసం అది తగ్గించుకునే దానికి ప్రయత్నం చేస్తే మన దేశానికే కాదు.. ఈ ప్రపంచానికే మంచి చేసిన వాళ్లమవుతాం.

ఇక ఫైనల్ గా.. దేశాన్ని ఉద్ధరించడం పక్కనపెడితే.. మన ఇంట్లో వాళ్ళతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? అమ్మతో.. నాన్న తో ఎలా ఉంటున్నాం? భార్యతో భర్తతో ఎలా ఉంటున్నాం .. పిల్లలతో ఎలా ఉంటున్నాం? ఇంట గెలవలేని వారు రచ్చ ఎలా గెలుస్తారు? ఇలాంటి వాటిపై కూడా యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు ఉన్నాయి..
ఓపిక ఉంటే.. చూడొచ్చు.. చాలా నేర్చుకోవచ్చు. నాకెవర్రా చెప్పేది బోషడీకె.. నాకు నేనే రాజు..నేనే మంత్రి.. అనేవారికి ఎలాగూ మెరుగైన సమాజం.. అసభ్య సమాజం రెడీగా ఉంటుంది.
Tags:    

Similar News