ఈ ఉదంతం గురించి చదివిన వెంటనే పంజాగుట్ట రోడ్డుకు ఏమైందన్న సందేహం మనసులో మెదలక మానదు. కొద్ది రోజుల కిందట తప్పతాగిన ఇంజనీరింగ్ కుర్రాళ్లు నిర్లక్ష్యంగా కారును నడుపుతూ.. డివైడర్ ను ఢీ కొట్టటం.. కారు పల్టీ కొట్టి.. రోడ్డుకు అవతల వైపు వెళుతున్న కారు మీద పడటం.. ఆ కారులో ప్రయాణిస్తున్న చిన్నారి రమ్య.. ఆమె తాత.. బాబాయ్ లు మృత్యువుపాలు కావటం తెలిసిందే. సరిగ్గా అదే ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం తృటిలో తప్పింది.
టిప్పర్.. బైక్ లు శనివారం ఉదయం ఢీ కొనటం.. దీంతో.. టిప్పర్ పంజాగుట్ట ఫ్లైఓవర్ నుంచి కింద పడిపోయింది. ఈ సమయంలో ప్లైఓవర్ కిందన ఎవరూ ప్రయాణం చేస్తూ ఉండకపోవటం.. పెను ప్రమాదం తప్పించి. మొన్న రమ్య కుటుంబం కారు ప్రమాదానికి గురైన ప్రాంతంలోనే తాజా యాక్సిడెంట్ చోటు చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద..కిందా జర్నీ చేసేటప్పుడు మాత్రం కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకోవటం.. ముందు వెనుకా చూసుకుంటూ వాహనాన్ని నడపటం మంచిదన్నట్లుగా పరిస్థితి ఉందని చెప్పక తప్పదు.