అక్కడ గాలి పీలిస్తే ఖతమే..!

Update: 2019-10-02 06:46 GMT
పైరోలసిస్ పరిశ్రమలు.. అంటే పాత టైర్లను కాల్చి అందులోంచి రబ్బర్ సహా ఆయిల్ ను తీసే పరిశ్రమలు. ఇప్పుడీ పరిశ్రమలు గాలి కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఎంతలా అంటే ఆ పరిశ్రమల్లో పాత టైర్లను కాల్చడంతో ఆ ప్రాంతమంతా గాలి కాలుష్యమై 34 క్యాన్సర్ కారకాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ గాలి పీలిస్తే మీకు క్యాన్సర్ రావడం పక్కా అని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

దేశంలోనే అత్యధికంగా ఈ టైర్లను కాల్చే పరిశ్రమలు ఉత్తరప్రదేశ్ (117) లో ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా మన తెలంగాణ(61)లోనే ఉన్నాయి. పర్యావరణాన్ని నాశనం చేసే రోగాలు వ్యాపింప చేసే ఈ పరిశ్రమలను విదేశాల్లో నిషేధించారు. అందుకే అక్కడ వాడి పారేసిన పాత టైర్లను పెద్దఎత్తున భారత దేశానికి దిగుమతి చేసుకొని ఇక్కడ కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

తెలంగాణలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు - రంగారెడ్డి జిల్లా కొత్తూరు - యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం ప్రాంతాల్లో ఈ పాత టైర్ల రీసైక్లింగ్ పరిశ్రమలున్నాయి. ఈ టైర్లను కాల్చడం వల్ల అక్కడ బెంజిన్ - డయాక్సిడ్ - ప్యూరాన్స్ - నైట్రోజన్ వంటి అత్యంత హానికర 34 రసాయనాలు గాలిలో కలిసి క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయి. ఈ ప్రాంతాల్లో గాలి పీలిస్తే మన ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. ఈ మేరకు ఈ పాతటైర్ల రీసైక్లింగ్ పరిశ్రమలను దేశంలో మూసివేయాలని ఇప్పటికే ‘ఎస్ ఏఎఫ్ ఈ’ అనే ఎన్జీవో సంస్థ సుప్రీం కోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేసింది.
    

Tags:    

Similar News