తిరుప‌తి ఉప ఎన్నిక‌.. అంద‌రి దృష్టి ఆ సెగ్మెంట్ పైనే ?

Update: 2021-03-28 02:30 GMT
ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. తెలంగాణ‌లో నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌పై అందరి దృష్టి ఎలా ? ఉందో ఏపీలో తిరుప‌తి ఉప ఎన్నిక విష‌యంలోనూ అంతే ఆస‌క్తితో ఉన్నారు. అయితే సాగ‌ర్లో పోటీ ట‌ఫ్‌గా ఉంటుంద‌ని అంద‌రూ అంచ‌నా వేస్తున్నారు. తిరుప‌తి ఫ‌లితం విష‌యంలో డౌట్ లేక‌పోయినా అక్క‌డ కొన్ని సంచ‌ల‌నాలు న‌మోదు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో కాస్త ఆశ‌తో ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీకి వ‌చ్చిన 2.28 ల‌క్ష‌ల మెజార్టీని మించి 3 లక్ష‌ల మెజార్టీ సాధించాల‌ని వైసీపీ ల‌క్ష్యంగా పెట్టుకుంది. అయితే వైసీపీ అనుకున్న మెజార్టీ వ‌స్తుందా ? రాదా ? అన్న‌దే ఇక్క‌డ సందేహం. ఇక గెలిచినా గెల‌వ‌క‌పోయినా వైసీపీ మెజార్టీని గ‌త ఎన్నిక‌ల కంటే చాలా త‌గ్గించేయాల‌న్న‌దే టీడీపీ టార్గెట్ ?

ఎవ‌రి అంచనాలు ఎలా ? ఉన్నా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో అధికార వైసీపీకే ఒక సెగ్మెంట్లో టెన్ష‌న్ ప‌ట్టుకున్న మాట వాస్త‌వం. అదే పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన తిరుప‌తి. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ వైసీపీకి అనుకున్న స్థాయిలో అయితే ఓట్లు రావ‌డం లేదు. 2014, 2019 ఎన్నికల్లో ఇదే రిపీట్ అయ్యింది. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న నెల‌కొంది. అయితే ఈ సారి కూడా అదే రిపీట్ అవుతుందా ? అన్న సందేహం ఉంది. పోనీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ రావు మృతి చెంద‌డంతో ఆ సెంటిమెంట్ ఇక్క‌డ వ‌ర్క‌వుట్ అవుతుందా ? అంటే ఆ ఛాన్స్ కూడా లేదు. వైసీపీ ఆ ఫ్యామిలీకే సీటు ఇవ్వ‌లేదు.. పైగా బ‌ల్లి నెల్లూరు జిల్లాకు చెందిన వ్య‌క్తి కావ‌డంతో ఆ సెంటిమెంట్ ఇక్క‌డ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ అయ్యేలా క‌న‌ప‌డ‌డం లేదు.

ఇక 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వైసీపీ ఎంపీగా వెల‌గ‌ల‌ప‌ల్లి వ‌ర‌ప్ర‌సాద్ ( ప్ర‌స్తుత గూడూరు వైసీపీ ఎమ్మెల్యే ) గెలిచినా తిరుప‌తి సెగ్మెంట్ వ‌ర‌కు నాటి బీజేపీ అభ్య‌ర్థి ( టీడీపీ + బీజేపీ పొత్తు)కి 30 వేల ఓట్ల పై చిలుకు మెజార్టీ వ‌చ్చింది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రం అంత‌టా వైసీపీ వేవ్ ఉన్నా తిరుప‌తిలో వైసీపీ ఎమ్మెల్యే 700 ఓట్ల‌తో గెలిచినా కూడా పార్ల‌మెంటుకు వ‌చ్చేస‌రికి టీడీపీ ఎంపీ అభ్యర్థికి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో 3,578 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇటీవ‌ల తిరుప‌తి కార్పోరేష‌న్‌ను సైతం వైసీపీ వీజీగా గెలిచేసింది. వైసీపీకి ఇక్క‌డ ఇప్పుడు ప‌ట్టు ఉంటుంద‌నుకున్నా... స్థానిక ఎన్నిక‌ల్లో అనేక ప్ర‌లోబాలు, బెదిరింపులు ప‌నిచేశాయి.

ఇప్పుడు ఆ సీన్ ఉండ‌ద‌నే అంటున్నారు. ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ సైతం తిరుప‌తి ఉప ఎన్నిక‌పై సీమ‌క్ష నిర్వ‌హించిన‌ప్పుడు సైతం ప్ర‌త్యేకంగా త‌రుప‌తి గురించే ప్ర‌స్తావించార‌ట‌. మిగిలిన ఆరు సెగ్మెంట్ల‌లో ఎంత మెజార్టీ వ‌స్తుందో ? ఇక్క‌డ దాదాపు అంతే మెజార్టీ వ‌చ్చేలా చూడాల‌ని ఉప ఎన్నిక బాధ్యుల‌తో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, టీటీడీ చైర్మ‌న్ వైవి. సుబ్బారెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ట‌. మ‌రి తిరుప‌తిలో వైసీపీ ఏం చేస్తుందో ? చూడాలి.


Tags:    

Similar News