2017 లో టాలీవుడ్ లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో.. గత నాలుగున్నరేళ్లుగా ఎన్నో ట్విస్టులు టర్న్ లు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ఎక్సైజ్ శాఖ సిట్ దర్యాప్తుతో మొదలుపెట్టి.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ వరకు వచ్చింది. అయినప్పటికీ ఈ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ - ఈడీలకు ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసును మూసేయాలని అధికారులు భావిస్తున్నట్లు ఆ మధ్య కథనాలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఈడీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎక్సైజ్ శాఖకు మరోసారి ఈడీ లేఖ రాసింది. నిందితుల సాక్షుల వాంగ్మూలాలు - కాల్ డేటా - డిజిటల్ రికార్డులు ఇవ్వాలని ఈడీ అధికారులు లేఖలో కోరారు. ఎక్సైజ్ శాఖ కేసు వివరాలు, డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని ఇప్పటికే హైకోర్ట్ కు తెలిపింది. దీంతో మాధకద్రవ్యాల కేసుకి సంబంధించి రికార్డులన్నీ ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. డ్రగ్స్ యువతను అతలాకుతలం చేస్తున్నాయని.. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈడీకి సహకరించాలని సూచించింది.
డ్రగ్స్ కేసు విచారణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సరైన సంస్థేనని హైకోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తునకు అవసరమైన వివరాలు, డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే మళ్లీ తమను సంప్రదించవచ్చునని ఈడీకి తెలిపింది. ఈ క్రమంలోనే ఎక్సైజ్ శాఖకు మరోసారి ఈడీ లేఖ రాసింది. ఇకపోతే ఈ కేసులో డ్రగ్ పెడ్లర్ టోనీ వ్యవహారంపై ఈడీ ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. నైజిరీయాకు టోనీ పెద్ద మొత్తంలో నిధులు మళ్లించినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. టోనీ అనుచరులు, సహచరులను విచారిస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని ఈడీ భావిస్తోంది.
కాగా, తెలంగాణా ఆబ్కారీ పోలీసులు నాలుగేళ్ళ క్రితం కెల్విన్ మార్కెరాన్స్ అనే డ్రగ్ సప్లయిర్ ని అరెస్ట్ చేయడంతో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం తెర మీదకు వచ్చింది. విచారణలో కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ పలువురు సినీ ప్రముఖులను ఎంక్వైరీ చేశారు. వీరి నుంచి గోళ్లు, తల వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు కూడా పంపించారు. అయితే డ్రగ్స్ కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వారికి క్లీన్ చిట్ ఇచ్చింది.
ఈ క్రమంలో మాధకద్రవ్యాల క్రయ విక్రయాల్లో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) మరియు మనీ లాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. 12మంది టాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసి.. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు విచారించారు. ప్రధాన నిందితుడు కెల్విన్ తో ఉన్న సంబంధాలపై ఆర్థిక లావాదేవీల గురించి అధికారులు ఆరా తీశారు.
అయితే ఆధారాలు లభించకపోవడంతో కేసును క్లోజ్ చేయనున్నారనే టాక్ వచ్చింది. టాలీవుడ్ ప్రముఖులందరూ ఊపిరి పీల్చుకున్నట్లే అని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఎక్సైజ్ శాఖకు ఈడీ రాసిన లేఖతో ఈ కేసు సజీవంగానే ఉందని అర్థం అవుతుంది.