మెట్రో పాలిటన్ సిటీ హైదరాబాద్ లో డ్రగ్స్ దందా ఎన్ని కట్టుబాట్లు పెట్టినా ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. 153 గ్రాముల కొకైన్ ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఓ నైజీరియన్ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఇతడిని ప్రశ్నించగా ‘డాడీ బాయ్’ అనే ప్రముఖ డ్రగ్ స్మగ్లర్ పేరు బయటకు వచ్చింది. హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు ‘డాడీ బాయ్’ కీలక వ్యక్తి. మారుపేరుతో హైదరాబాద్ లో డ్రగ్స్ దండా నడిపే ఇతడిని గతంలో పోలీసులు పట్టుకోగా మకాంను గోవా, బెంగళూరుకు మార్చాడు. అయితే దందా మాత్రం హైదరాబాద్ లో కొనసాగుతోంది.
తాజాగా ‘గుడ్ స్టఫ్’ పేరిట ఓ వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసిన డాడీ బాయ్ ఇందులోనే ఆర్డర్స్ స్వీకరించడం.. నైజీరియన్ వ్యక్తి జేమ్స్ తో డెలవరీ చేయడం మొదలుపెట్టాడు. ఈ వాట్సాప్ మెసేజ్ లు డీకోడ్ చేసిన పోలీసులు చాకచక్యండా డెలివరీ బాయ్స్ జేమ్స్ ను అరెస్ట్ చేశారు.
153 కొకైన్ పిన్స్ ను ఎవరు ఆర్డర్ చేశారనే దానిపై విచారణ జరపగా తాజాగా కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు, మరికొంత మంది ప్రముఖుల తనయుల పేర్లు బయటకు వచ్చాయి. ఈ ప్రముఖులు ఎవరనేది పోలీసులు ఆరాతీస్తున్నట్టు సమాచారం.
ఈ భారీ డ్రగ్స్ దందాకు స్టార్ హోటళ్లు, నెక్లస్ రోడ్, డ్రైవ్ ఇన్ స్పాట్స్ లు డెలివరీ కేంద్రాలని పోలీసులు గుర్తించారట.. హైదరాబాద్ పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు చేపట్టినా డ్రగ్స్ దందా మాత్రం ఆగడం లేదు.