టాలీవుడ్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కొద్దిరోజులుగా క్యాస్టింగ్ కౌచ్ పేరుతో జరిగిన హాడావుడి.. ఆ పేరుతో కొన్ని న్యూస్ ఛానళ్లు వ్యవహరించిన తీరు.. అనంతరం ఈ వ్యవహారంలోకి పవన్ కల్యాణ్ రావటం.. ఆ తర్వాత నుంచి చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర హీరోలు తాజాగా ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకోవటం ఆసక్తికరంగా మారింది.
అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా సాగిన ఈ సమావేశంలో 18 మంది వరకూ అగ్ర హీరోలు.. ఇతర సినీ ప్రముఖులు హాజరైనట్లుగా చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకొని ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో టీవీ ఛానళ్ల మీదనే ప్రధానంగా చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మీడియా ఛానళ్లపై ఈ సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
టీఆర్పీ రేటింగ్ ల కోసం తమపై ఇష్టారాజ్యంగా వార్తల్ని ప్రసారం చేస్తున్నట్లుగా ఫీలైనట్లుగా చెబుతున్నారు. టీవీ ఛానళ్లు కేవలం సినిమాల మీద.. వాటి కంటెంట్ మీదనే ఆధారపడి బతుకుతున్నాయని.. వాటికి కంటెంట్.. ఇంటర్వ్యూలు ఇవ్వకూడదన్న వాదనను పలువురు బలంగా వినిపించినట్లుగా చెబుతున్నారు. సినిమాలకు సంబంధించిన కంటెంట్ టీవీ ఛానళ్లకు అస్సలు ఇవ్వకూడదన్న ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ కీలక భేటీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ సీఎం చంద్రబాబు వియ్యంకుడు.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణలు రాలేదని చెబుతున్నారు. ఇకపై సమస్యలు ఏమైనా వస్తే గ్రూపులు.. గ్రూపులుగా మాట్లాడకూడదని.. ఎవరికి వారు అన్నట్లు కాకుండా ఐక్యమత్యంతో అందరూ ఒకే మాట మీద ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
తాజాగా జరిగిన సమావేశానికి చిరంజీవి నేతృత్వం వహించగా.. వెంకటేశ్.. నాగార్జున.. మహేశ్ బాబు.. ఎన్టీఆర్.. కల్యాణ్ రామ్.. అల్లు అర్జున్.. రాంచరణ్.. రామ్.. నాని.. సాయి ధరమ్ తేజ్.. వరుణ్ తేజ్ లతో పాటు కేఎల్ నారాయణ.. తమ్మారెడ్డి భరద్వాజ.. అల్లు అరవింద్.. బీవీఎస్ ఎన్ ప్రసాద్.. జీవిత రాజశేఖర్.. మంచులక్ష్మీలతో పాటు మరికొందరు ప్రముఖులు కూడా పా్లగొన్నట్లుగా చెబుతున్నారు. తాజాగా జరిగిన సమావేశంలో పవన్.. బాలయ్యలు మినహా దాదాపు టాప్ హీరోలంతా ఈ మీటింగ్‌కు హాజరైనట్లేనని చెప్పాలి.
శ్రీరెడ్డి వ్యవహారంపై మొదటే పిలిచి మాట్లాడి ఉంటే విషయం ఇంతవరకూ వచ్చేదే కాదని.. కొందరు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో మరోసారి భేటీ అయి.. నిర్ణయం తీసుకోవాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది. తాజా భేటీకి సంబంధించిన వివరాలు మీడియాకు చెప్పకూడదని.. తుది నిర్ణయం తీసుకున్న తర్వాత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ద్వారానే ప్రకటించాలని టాలీవుడ్ పెద్దలు డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు.