సినిమాల‌ పై క‌ట్ట‌డి.. ఏపీ స‌ర్కారు సాధించిందేంటి?

Update: 2022-02-26 12:30 GMT
ఏపీలో సినిమాల అల‌జ‌డి కొన‌సాగుతూనే ఉంది. ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌తో అటు ధియేట‌ర్ల య‌జ‌మానుల‌కు,ఇటు టాలీవుడ్ కూడా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. అయిన ప్ప‌టికీ.. ప్ర‌బుత్వం మాత్రం త‌న పంతాన్ని నెగ్గించుకునే ప‌నిలో ప‌డిపోయింది. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఇన్ని ద‌శాబ్దాల కాలంలో ఏ ప్ర‌బుత్వం కూడా సినిమా టికెట్ల విష‌యంలో జోక్యం చేసుకోలేదు. అయితే.. జ‌గ‌న్ స‌ర్కారు మాత్రం దీనిలో జోక్యం చేసుకుంది. ఇదే వివాదానికి దారితీసింది.

మ‌రీ ముఖ్యంగా జ‌న‌సేన నాయ‌కుడు, ఏపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీలు విడుద‌లైన ప్ర‌తిసారీ.. ఈ వివాదం మ‌రింత పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. సినిమా టికెట్ల‌ను ఇష్టానుసా రంగా విక్ర‌యించి.. పేద ప్ర‌జ‌ల డ‌బ్బులు లాగేస్తున్నార‌నేది ప్ర‌భుత్వ వాద‌న‌. ఈక్ర‌మంలోనే ఆన్‌లైన్ టికెటింగ్ విధానం తెచ్చింది. అదేస‌మ‌యంలో మూవీ షోల‌పై నియంత్ర‌ణ విధించింది. గ‌తంలో ఐదు షోల‌కు అవ‌కాశం ఉన్నా.. త‌ర్వాత‌.. వైసీపీ స‌ర్కారు మాత్రం కేవ‌లం నాలుగు షోల‌కే ప‌రిమితం చేశారు. హ‌ద్దు మీరితే చ‌ర్య‌లు తప్ప‌వ‌ని హెచ్చ‌రించింది.

ఈ క్ర‌మంలోనే పెద్ద సినిమాలు విడుద‌లైన ప్ర‌తిసారీ.. థియేట‌ర్ల వ‌ద్ద‌.. అధికారులను రంగంలోకి దింపా రు. దీంతో థియేట‌ర్ల య‌జ‌మానులు అంత త‌క్కువ ధ‌ర‌ల‌కు టికెట్లు అమ్మి.. సినిమాను ర‌న్ చేయ‌లేమం టూ.. బోర్డు పెట్టేశారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే అప్ప‌టివ‌కీల్ సాబ్ విడుద‌లైంది. ఇదిలావుంటే.. సినిమా టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపుతో .. తీవ్ర‌న‌ష్ట‌పోతున్నామంటూ.. చిరుతో పాటు మ‌హేష్‌బాబు, ప్ర‌భాస్ వంటి కీల‌క హీరోలు వ‌చ్చి.. జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. ఇంతింత ఆంక్ష‌లు పెడితే.. త‌మ‌కు తీవ్ర న‌ష్ట‌మ‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే కొత్త జీవో ఇస్తామ‌ని.. జ‌గ‌న్ వారికి హామీ ఇచ్చిన‌ట్టు చిరు చెప్పారు.

అయితే.. ఇది జ‌రిగి దాదాపు నెల రోజులు గ‌డుస్తున్నా.. కొత్త జీవో అయితే.. రాలేదు. కానీ ప‌వ‌న్ న‌టించిన‌.. భీమ్లానాయ‌క్ మూవీ విడుద‌లైంది. దీంతో ప్ర‌భుత్వం ఎప్ప‌టిలాగానే.. ప్ర‌జ‌ల‌ప‌క్షాన నిలుచున్నాం.. అం టూ.. టికెట్ ధ‌ర‌ల‌ను పెంచేందుకు వీలు లేకుండా.. అధికారుల‌ను థియేట‌ర్ల వ‌ద్ద కాప‌లా పెట్టింది. అంతే కాదు.. కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే.. పోలీసులు నేరుగా థియేట‌ర్ల‌కు వెళ్లి.. సినిమా మ‌ధ్య‌లోనే ప్రేక్ష‌కుల ను ప‌లు ప్ర‌శ్న‌ల‌తో వేధించార‌నే వాద‌న వినిపిస్తోంది.

అదేస‌మ‌యంలో ఎక్స్‌ట్రా చైర్లు వేయ‌డం.. ప‌రిమితికి మించి.. ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించడంపైనా.. ప్ర భుత్వం దృష్టి పెట్టింది. ఇక‌, ఐదో షోకు అనుమ‌తి లేకుండా పోయింది. అయితే.. ఈ విష‌యాలు.. ఇటు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌లోనూ.. ఇటు రాజ‌కీయంగానూ తీవ్ర దుమారం రేపేలా చేసింది. దీంతో చంద్ర‌బాబు, నారా లోకేష్ వంటివారు నేరుగా రంగంలోకి దిగి.. సినిమాల‌పై జ‌గ‌న్ పెత్త‌నం అంటూ.. కారాలు మిరియా లు నూరారు. ఇక‌, యూత్ చాలా జిల్లాల్లో ఆందోళ‌న కు దిగింది. ఒక జిల్లాలో అయితే.. యాజ‌మాన్యం, పోలీసులు కూడా యూత్‌ను ఆప‌లేక‌పోయారు.

మ‌రి స‌ర్కారు ఏం సాధించిన‌ట్టు?  ఏం చేసిన‌ట్టు?  పోనీ..ప్ర‌జ‌ల కోస‌మే.. తాము ఈ నిబంధ‌న‌లు ఆంక్ష‌లు తీసుకువ‌చ్చామ‌ని.. టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గించామ‌ని.. ప్ర‌చారం చేసుకునే ప్ర‌య‌త్నం కానీ.. ప్ర‌జ‌ల‌ను ఒప్పించే ప్ర‌య‌త్నం కానీ.. చేయ‌గ‌లిగిందా?  అదే జరిగి ఉంటే.. ప్ర‌జ‌లే ప్ర‌భుత్వానికి అనుకూలంగా మారి ఉండేవారు. కానీ.. అలా చేయ‌లేక పోయింది. పోనీ.. అధికారుల‌ను పెట్టి సాధించ‌గ‌లిగారా?  బ్లాక్‌లో ఒక్కొక్క టికెట్‌ను రూ.500 నుంచి 1000 వ‌ర‌కు అమ్మినా.. ఏమీ చేయ‌లేక పోయారు. ప్ర‌భుత్వం ఒక విధానం తీసుకురావ‌డం త‌ప్పుకాదు.. ఆ విధానాన్ని అమ‌లు చేయ‌డంలోని లోపాల‌ను.. ప్ర‌జ‌ల‌ను మెప్పించ‌డంలో ఉన్న దిద్దుబాట్ల‌ను గుర్తించ‌లేక పోవ‌డ‌మే త‌ప్ప‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజా ప‌రిణామంలో వైసీపీ ప్ర‌భుత్వం విఫ‌లం కాగా.. ప‌వ‌న్ ఇమేజ్ పెరిగింద‌ని అంటున్నారు.
Tags:    

Similar News