మరో రెండు వారాల్లో ఉప ఎన్నిక జరగనున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గానికి ముఖ్యంగ్రి కేసీఆర్ రేపు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో అవసరమైతే..తాను స్వయంగా పాల్గొంటానని.. గతంలో కేసీఆర్ ప్రకటించారు.
ఇప్పుడు.. దీనికి సంబంధించిన ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రోజుల.. అది కూడా రోజు విడిచి రోజు కేసీఆర్ ప్రచారం ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. దీని ప్రకారం.. మండలాలవారీగా.. ప్రచార పర్వానికి.. కేసీఆర్ వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు.
దీనిని ఏకాదశి.. గురువారం, శుక్రవారం కలిసి వస్తున్నందున ఆ రోజుల్లో ప్రారంభించాలని.. కేసీఆర్ బావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఆయన ఢిల్లీ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ అంత్యక్రియలకు వెళ్లిన కేసీఆర్ అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఎనిమిది రోజులు అక్కడే ఉంటూ మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.వాస్తవానికి భారత్ రాష్ట్ర సమితి ప్రకటన తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. బీఆర్ఎస్ కోసం సిద్ధమవుతున్న కార్యాలయాన్ని సందర్శించారు.
కార్యాలయంలో చేయవలసిన మార్పుల గురించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ ఎనిమిది రోజులు ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీ యాలపై కొందరి ముఖ్య నేతలతో సంభాషించి, చర్చించారు. అనంతరం సీఎం స్వల్ప అస్వస్తతకు గురయ్యారు.. అక్కడే ఉంటూ చికిత్స తీసుకున్నా రు. ఢిల్లీలోనే రాష్ట్ర ముఖ్య అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
బుధవారం మధ్యాహ్నం తిరిగి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్నారు. ఇక, గురువారం సాయంత్రం నుంచి మునుగోడులో పర్యటించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. ఇక, కేసీఆర్ రంగం లోకి దిగితే. ప్రతిపక్షాలపై నిప్పులు కురిపించడం ఖాయమని అంటున్నారు టీఆర్ ఎస్ నాయకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.