ఆ మధ్యన ఉల్లిపాయ ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ.. మహారాష్ట్రకు చెందిన ఒక మండీలో దొంగతనం చేసి.. ఉల్లి స్టాక్ ను దొంగతనం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆకాశాన్ని అంటుతున్న కందిపప్పు మీద దొంగల కన్ను పడింది. ఆకాశాన్ని అంటుతున్న కందిపప్పు ధరల కారణంగా.. తాజాగా వాటి మీద దృష్టి పెట్టారు దొంగలు. విలువైన వస్తువులలో కందిపప్పును చేర్చిన దొంగలు ముంబయిలోని ఒక కిరాణా షాపులో చొరబడి దాదాపు 30 కేజీల కందిపప్పును దోచుకెళ్లిన ఘటన తాజాగా బయటకు వచ్చింది.
మూడు కిరాణా షాపుల్లో పడిన దొంగలు.. క్యాష్ బాక్స్ లో ఉన్న నగదుతో పాటు.. కందిపప్పును తీసుకెళ్లారు. కందిపప్పుతో పాటు డ్రైఫ్రూట్స్ ను కూడా వారి వెంట తీసుకెళ్లారు.
నగదు.. విలువైన వస్తువులతో పాటు.. కందిపప్పు కూడా దొంగతనం చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కిలో రూ.200కు కాస్త అటూఇటుగా పలుకుతున్న నేపథ్యంలో కందిపప్పు కూడా విలువైన వస్తువుల జాబితాలో చేరిపోయి.. దొంగల కన్ను పడిందని చెప్పక తప్పదు. అయితే.. దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల ద్వారా దొంగతనం చేసిన దొంగల్ని పోలీసులు గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పటి రోజుల్లో ఆకాశానికి అంటుతున్న కందిపప్పును సైతం కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం తాజా ఘటన స్పష్టం చేసిందని చెప్పొచ్చు