జీవితంలో మనం నివశించే చోట, సొంత ఇళ్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. ఎవరి స్థాయిని బట్టి వాళ్లు వారు ఇంటిని తమకి ఉన్న వనరులతో చాలా అందంగా నిర్మించుకుంటారు. ఇందులో సాధారణ స్థాయి నుంచి హైఫై ఇళ్లు వరకు , బస్తి నుండి విల్లాస్ వరకు ఉంటాయి. దేశంలో ఉన్న కొన్ని ఇళ్లను గురించి గానీ, ఆ ఇళ్ల ధరను గురించి గానీ తెలుసుకుంటే మనదేశంలో ఇలాంటి ఇల్లులు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోతారు. దేశంలో అత్యంత ఖరీదైన టాప్ 5 ఇళ్ల గురించి , ఆ ఇళ్ల ధర ఎంత, వాటి యజమానులెవరో ఇప్పుడు చూద్దాం..
1. ఏంటిల్లా : మనదేశంలోనే అత్యంత ఖరీదైన ఇంటి పేరు ఏంటిల్లా. దేశంలోని అతి ఖరీదైన ఇళ్ల జాబితాలో మొదటి స్థానం ఈ ఇంటిదే. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇళ్లు ఇది. ఏంటిలా ఇళ్లు కేవలం ఇండియానే కాదు ప్రపంచంలోని అతి ఖరీదైన ఇళ్లలో ఒకటి. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఫోర్బ్స్ మేగజైన్ నివేదిక ప్రకారం ఈ ఇంటి ధర 7 వేల 337 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ ఇంటిలో 27 ఫ్లోర్లు ఉన్నాయి. ఇందులోంచి 6 ఫోర్లు కేవలం పార్కింగ్ కోసమే కేటాయించారు. ఈ ఇంటిలో అన్ని లగ్జరియల్ సౌకర్యాలు, వసతులు పుష్కలంగా ఉన్నాయి.
2. ఎబోడ్ : బాంద్రాలో ఉన్న అనిల్ అంబానీ ఇళ్లు ఎబోడ్. ఇది దేశంలోని రెండవ అతి ఖరీదైన ఇళ్లు. బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం ఈ ఇంటి విలువ 5 వేల కోట్లుంటుంది. ఇది 66 అంతస్థుల భవనం. ఇందులో స్విమ్మింగ్ పూల్, హెలీ ప్యాడ్ సౌకర్యాలన్నీ ఉన్నాయి.
3. కాన్సులేట్: పూణావాలా గ్రూప్ ఛైర్మన్ సైరస్ పూణావాలా...ముంబైలోని బీచ్ క్యాండీలో ఉన్న కాన్సులేట్ భవనం లింకన్ హౌస్ కోసం వేలం పాడారు. పీటీఐ నివేదిక ప్రకారం 750 కోట్లకు వేలం పలికింది. 2015లో జరిగిన వేలం ఇది. ఇది దేశంలోని బంగ్లాల్లో అతి ఖరీదైంది.
4. జిటియా హౌస్: జిటియా హౌస్ ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా హౌస్ . ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా 2015లో మాలాబార్ హిల్‌లో 30 వేల చదరపు అడుగుల్లో ఉన్న జటియా హౌస్ కోసం 425 కోట్లకు వేలం పాడారు. 2012లో నాలుగు వందల కోట్లకు విక్రయమైన మహేశ్వరి హౌస్ రికార్డును ఈ ఇళ్లు బద్దలు కొట్టింది.
5. మన్నత్: ప్రపంచంలో రెండవ అత్యంత ధనికుడైన హీరో షారుఖ్ ఖాన్ ఇళ్లు కూడా టాప్ 5 జాబితాలో ఉంది. షారుఖ్ ఖాన్ ఇంటి పేరు మన్నత్. షారుక్ ఖాన్ ఇల్లు ముంబైలో ఉంది. ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ నివేదిక ప్రకారం ఈ ఇంటి ధర దాదాపుగా 2 వందల కోట్లు ఉంటుంది.