కేద్రం తాజాగా ప్రకటించిన స్వచ్ఛ నగరాల రేటింగ్స్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ ఊరు.. పట్టణం.. నగరం.. కానీ లేకపోవటం గమనార్హం. వ్యర్థాల నిర్వహణలో సమర్థంగా వ్యవహరించిన ఊళ్లకు ఇచ్చే ఈ రేటింగ్ కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు స్థానం దక్కించుకోలేకపోవటం చూస్తే.. ఆ విషయంలో ఎంతలా వెనుకబడి ఉన్నామన్న భావన కలిగే దుస్థితి. దేశంలో మరే రాష్ట్రంలో అమలు చేయని ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని.. వినూత్న విధానాల్ని అదే పనిగా ప్రకటిస్తారన్న పేరున్న కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉన్న తెలంగాణలో ఏ ఒక్క ప్రాంతం కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ రాకపోవటం ఆసక్తికరంగా మారింది.
తాజాగా కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ ప్రకటించిన గార్బేజ్ ఫ్రీ నగరాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కలేదు. మాయదారి మహమ్మారిపై సాగుతున్న పోరులో స్వచ్ఛ భారత్ మిషన్ కీలకంగా మారిందన్నది కేంద్రం భావన. దీనికి తగ్గట్లే.. తాజాగా ర్యాంకుల్ని ప్రకటించింది. ఇందులో ఫైవ్ స్టార్ రేటింగ్ చోటు దక్కించుకున్న ఆరు ప్రాంతాల విషయానికి వస్తే.. ఛత్తీస్ గఢ్ లాంటి వెనుకబడి రాష్ట్రంలోని ఒక ప్రాంతం ఫైవ్ స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. అంబికాపూర్ ఆ ఘనతను సొంతం చేసుకుంది. అదే తీరులో గుజరాత్ లోని రాజ్ కోట్.. సూరత్.. కర్ణాటకలోని మైసూర్.. మధ్యప్రదేశ్ లో ఇండోర్.. మహారాష్ట్రలోని నవీ ముంబయిలు నిలిచాయి.
ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన ప్రాంతాల జాబితానుచూస్తే ఆసక్తికర అంశాలు కనిపించక మానదు. మొత్తం ఆరు ప్రాంతాలు అయితే.. అందులో మెజార్టీ బీజేపీ పాలిత రాష్ట్రాలు కావటం గమనార్హం. తాము అధికారంలో ఉన్న ప్రాంతాల్లో స్వచ్చత విషయంలో ఇస్తున్న ప్రాధాన్యత ఎంతన్నది చెప్పేలా తాజా స్టార్ రేటింగ్ లు ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తేలా జాబితా ఉంది. ఏమైనా స్వచ్చత స్టార్ రేటింగ్ లో.. ఫైవ్ స్టార్ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కకపోవటాన్ని అండర్ లైన్ చేసుకోవాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.