మోడీ బ్యాచ్ లో టాప్ ర్యాంకర్లు వీరే..

Update: 2016-05-26 11:19 GMT
గత కొద్దిరోజులుగా పరీక్షా ఫలితాలు వరుసగా వస్తున్నాయి.పరీక్షా ఫలితాలు వచ్చిన వెంటనే టాప్ ర్యాంకర్ల ఎవరన్న ఆసక్తి సహజంగా వ్యక్తమవుతోంది. ఈ ర్యాంకుల గోల విద్యార్థులకే కాదు.. రాజకీయ నాయకులకు కూడా ఎక్కువైందని చెప్పాలి. గతానికి భిన్నంగా ప్రతి ఆర్నెల్లకు.. ఏడాదికి ముఖ్యమంత్రుల పని తీరు.. మంత్రి వర్గంలోని మంత్రుల పని తీరు మీద ర్యాంకులు చెక్ చేయటం ఎక్కువైంది.

ఈ దిశగా పలు మీడియా సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ర్యాంకుల మోజు కొందరు రాజకీయ అధినేతలకు  కూడా ఎక్కువనే చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునే తీసుకుంటే.. ఎమ్మెల్యేల పని తీరుపై మదింపు చేసి ర్యాంకులు ఇవ్వటం.. వాటి ఆధారంగా పని చేస్తున్న వారు ఎవరన్న విషయాన్ని తేల్చటం.. అట్టడుగు ర్యాంకుల్లో ఉన్న వారికి ఆక్షింతలు వేయటం ఈ మధ్యన అలవాటుగా మారింది.

ఇదిలా ఉంటే.. కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరి రెండేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో.. మోడీ క్యాబినెట్ లోని మంత్రుల పని తీరుపై కొన్ని మీడియా సంస్థలు సర్వేలు నిర్వహించాయి. వీటిల్లో టాప్ ర్యాంకర్లుగా కొందరు మంత్రులు నిలవటం గమనార్హం. అలా టాప్ ఫైవ్ ర్యాంకర్లను చూస్తే..

= నితిన్ గడ్కరీ (రవాణా శాఖా మంత్రి)

= పీయూష్ గోయిల్ (విద్యుత్ శాఖా మంత్రి)

= మనోహర్ పారికర్ (రక్షణ మంత్రి)

= సురేశ్ ప్రభు (రైల్వే మంత్రి)

= అరుణ్ జైట్లీ  (ఆర్థికమంత్రి)
Tags:    

Similar News