కరుడుగట్టిన నేరస్తుడు.. గ్యాంగస్టర్.. కరుణ అన్నది ఏమాత్రం తెలీని నయింకు చెందిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. హత్యల మీద హత్యలు చేయిస్తూ.. వందలాది మంది మీద దాడులకు పాల్పడిన ఘన చరిత్ర ఉన్న ఈ నయిం వ్యక్తిగతంగా ఎలా ఉండేవాడు? అతను ఎలాంటి జీవితాన్ని అనుభవించాడు? నయిం ఎన్ కౌంటర్ అనంతరం అతడి ఇంటిని పరిశీలించిన అధికారులు ఏం చెబుతున్నారు? అతడునిత్యం ఎలా ఉండేవాడు? ఎలా వ్యవహరించేవాడు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్నాయి.
కబ్జాలు.. బెదిరింపులతో వేలాది కోట్ల ఆస్తులు సంపాదించి.. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నయిం.. స్వతహాగా అనుక్షణం భయం.. భయంగా గడిపేవాడని చెబుతున్నారు. సరిగ్గా తిండి తనకుండా.. కంటి నిండా నిద్ర లేక ఎప్పుడూ.. ఎవరో తరుముతున్నట్లుగా వ్యవహరించేవారని చెబుతున్నారు. ఎన్ కౌంటర్ ముందు తన ఇంటి నుంచే బయలుదేరిన నయిం ఇంటినిఅధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
వేల కోట్ల ఆస్తులు బయటపడిన నేపథ్యంలో అతగాడి నివాసం విలాసవంతంగా ఉంటుందని భావించిన అధికారులకు కాస్తంత షాక్ తగిలింది. ఎందుకంటే.. విలాసవంతమైన వస్తువులు ఎక్కడా కనిపించకపోవటం.. చిన్న చిన్న టీవీలు.. వస్తువులు మాత్రమే ఉన్నాయే తప్పించి.. ఎక్కడా విలాసవంతమైన వస్తువులు కనిపించలేదని చెబుతున్నారు.
ఇక.. ఇంటి శుభ్రత ఏ మాత్రం బాగోలేదని.. ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి ఉండటం.. బట్టలు చిందరవందరగా ఉన్నాయని.. వంటిల్లుగురించి అస్సలు చెప్పాల్సిన అవసరమే లేదని.. ముందు రోజు వండిన ఆహారాన్ని సైతం అలానే వదిలేయటం.. చాలా అపరిశుభ్రవాతావరణంలో ఉన్నట్లు చెబుతున్నారు. వంటగదిలో కాసేపు కూడా అధికారులు ఉండలేకపోయారని చెబుతున్న వైనం చూస్తే.. ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తుంది.
అన్నింటికింటే ఆశ్చర్యకరమైన విషయం.. నయిం ఇంట్లో పాతికమంది వరకూ పిల్లలు ఉండటం. అంతమంది పిల్లలు ఎందుకుఉన్నట్లు? వారు ఎవరు? వారినేం చేస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎన్ కౌంటర్ జరగటానికి ముందు వరకు ఆ ఇంట్లో పాతికమంది వరకూ పిల్లలు ఉండేవారని.. బయటకు వెళ్లేటప్పుడు కొంతమంది పిల్లల్ని తన వెంట నయిం తీసుకెళ్లారని.. ఎన్ కౌంటర్ తర్వాత ఒక మహిళ కొంతమంది పిల్లల్ని తనతో బయటకు తీసుకెళ్లిందని.. పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుసుకొని సదరుమహిళ పిల్లల్ని తీసుకురాకుండా ఎక్కడికో వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. ఇంతకీ ఆ పిల్లలు ఎవరు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వారితో నయిం ఏం చేస్తాడన్నది ఇప్పుడు అర్థం కాని విషయంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే.. డాల్మటైన్ జాతికి చెందిన రెండు కుక్కల్ని నయిం పెంచుకున్నట్లుగా గుర్తించారు.
శాండో.. కోమి పేర్లతో వ్యవహరించేఈ కుక్కలతో కొత్తవారిని గుర్తించటం.. పాములు.. తేళ్లు లాంటివి కనిపిస్తే అవి పెద్దగా అరుస్తాయని చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తన ప్రత్యర్థుల్ని మట్టు పెట్టేందుకు పాముల్ని వినియోగించిన నయిం.. తన విషయంలోనూ శత్రువులు సైతం అలానే వ్యవహరిస్తారన్న సందేహంతోనే పాముల్ని గుర్తించేలా ఉండేందుకు వీలుగా డాల్మటైన్ జాతికి చెందిన కుక్కల్ని పెంచుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. వేలాది కోట్ల ఆస్తులున్నా.. కడుపు నిండా తిండి తినలేక.. కంటి నిండా కునుకు తీయలేని దరిద్రం ఉన్న వ్యక్తి ఎంత నేరసామ్రాజ్య నాయకుడైతే లాభమేంది..?