నిమిషం.. నామినేషన్ మిస్

Update: 2018-11-20 06:08 GMT
తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తొలి అంకం ముగిసింది. సోమవారం చివర రోజున తెలంగాణ వ్యాప్తంగా 2087 నామినేషన్లు దాఖలు కావడం విశేషం. అంతకుముందు వారం రోజులవి కలుపుకుంటే మొత్తం 3584 నామినేషన్లు దాఖలైనట్టు  ఎన్నికల అధికారులు తెలిపారు. మంగళవారం నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇందులో తప్పులు - లోపాలు ఉన్న వారివి తిరస్కరించనున్నారు. ఈ నెల 22 వరకు నామినేషన్లకు గడువు ఉండడంతో ఎంత మంది బరిలో ఉంటారనేది ఆరోజే తేలనుంది.

సోమవారం చివరి రోజున కొందరు ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రులు కేటీఆర్ - ఈటెల - జగదీశ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి - భట్టి విక్రమార్క - డీకే అరుణ - రేవంత్ రెడ్డి - పొన్నాల లక్ష్మయ్య కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - జీవన్ రెడ్డి - ఆర్.కృష్ణయ్యలు నామినేషన్లు వేశారు.

ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓ అభ్యర్థికి చేదు అనుభవం ఎదురైంది. సమయం మించిపోయాక నిమిషం ఆలస్యంగా నామినేషన్ వేయడానికి వచ్చిన ఎన్సీపీ అభ్యర్థిని ఎన్నికల అధికారులు అనుమతించలేదు. పరీక్షల్లోనే కాదు.. ఎన్నికల్లోనూ నిమిషం నిబంధన కఠినంగా అమలవుతుందని అధికారులు తెలియజేసినట్టైంది. దీంతో సదురు అభ్యర్థి నామినేషన్ వేయకుండానే నిరాశగా వెనుదిరిగాడు.

సోమవారం చివరి రోజు దాఖలైన నామినేషన్లు - 2087.

*టీఆర్ ఎస్ -116 - కాంగ్రెస్ -135 - టీడీపీ-20 - బీజేపీ -128 - బీఎస్పీ-112 - సీపీఎం -28 - సీపీఐ -3 - ఏఐఎంఐఎం -13 - ఎన్సీపీ -21 - ఇండిపెండెంట్లు - ఇతరులు -1511 నామినేషన్లు వేశారు.


Tags:    

Similar News