స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి ప్రధాని మంత్రిగా వ్యవహరించి.. తనదైన ఆలోచనలతో దేశం మీద ప్రభావం చూపించిన కాంగ్రెసేతర నాయకులు చాలా చాలా తక్కువ. అలాంటి వారిలో.. భారతరత్న అటల్ బీహారీ వాజ్ పేయ్ ఒకరు. ఈ రోజు ఆయన 91వ జన్మదినోత్సవం. క్రిస్మస్ రోజు జన్మించిన ఆయన ప్రస్తుతం తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారు. విశ్వసనీయ వర్గాలు చెప్పేదేమంటే.. అటల్ ఆరోగ్యం ఏ మాత్రం సరిగా లేదని.. మంచానికి పరిమితమై ఉంటారని చెబుతారు. అంతేకాదు.. ఆయన ఎవరినీ గుర్తు పట్టలేదన్న మాట కూడా చెబుతారు.
ఆటల్ తాజా ఫోటోను ఇప్పటివరకూ విడుదల చేయలేదు. ఆయన దీన పరిస్థితి చూస్తే ఆయన్ను అమితంగా అభిమానించేవారు బాధ పడతారని.. వేదన చెందుతారన్న ఉద్దేశంతో ఆయన ఫోటోను విడుదల చేయరని చెబుతుంటారు. తన వాగ్థాటితో ప్రత్యర్థి రాజకీయ నేతల మనసుల్ని దోచుకున్న నేతగా వాజ్ పేయ్ ను చెప్పొచ్చు. బీజేపీ లాంటి పార్టీలో ఉదారవాదన నాయకత్వానికి నిలువెత్తు రూపంగా వాజ్ పేయ్ ను చెబుతుంటారు.
అలాంటి ఆయన జన్మదినోత్సవం రోజున ఒక అపురూప ఘటన చోటు చేసుకుంది. అఫ్ఘనిస్తాన్ పార్లమెంటు భవనాన్ని భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభిస్తే.. ఆ పార్లమెంటు భవనంలోని ఒక బ్లాక్ కు అటల్ బిహారీ వాజ్ పేయ్ పేరునుపెట్టటం మరో విశేషంగా చెప్పాలి. దేశం కాని దేశంలో.. అందునా అప్ఘనిస్తాన్ లాంటి దేశ పార్లమెంటులో ఒక బ్లాక్ కు వాజ్ పేయ్ పేరును పెట్టటం.. ఆయన మీద ప్రపంచ దేశాలకు ఉన్న గౌరవానికి నిదర్శనంగా చెప్పాలి.
మరింతటి గౌరవాన్ని పొందిన అటల్ కు.. జరిగిన విషయం తెలుసా? అంటే లేదనే చెప్పాలి. తీవ్రఅనారోగ్యంతో ఉన్న ఆయనకు ఏం చెప్పినా అర్థం చేసుకోలేని స్థితి లో ఉంటారని చెబుతారు. పుట్టిన రోజున ఘనమైన బహుమతి( తన పేరిట ఒక విదేశీ పార్లమెంటులోని ఒక బ్లాక్కు తన పేరును పెట్టిన విషయాన్ని) పొంది.. ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోవటానికి మించిన విషాదం ఇంకేం ఉంటుంది.