సాఫ్టువేరోళ్ల ఎర్రజెండా

Update: 2016-06-11 10:20 GMT
ఐటీ రంగం సంఘటితమవుతోంది. ఐటీ ఉద్యోగులు సంఘాలుగా ఏర్పడుతున్నారు. కడుపులో చల్ల కదలకుండా ఏసీ గదుల్లో పనిచేసుకునేవారికి యూనియన్లు ఎందుకనుకుంటున్నారా...? చాలా కంపెనీ ఉద్యోగుల హక్కులతో ఆడుకుంటున్నాయట.. అందుకే ఇప్పుడు యూనియన్లు గా ఏర్పడుతు తమ సమస్యల పరిష్కారానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.  అయితే.. ఐటీ కంపెనీలు మాత్రం ఈ పరిణామాలపై మౌనం వహిస్తున్నాయి. ఇన్ఫోసిస్ - విప్రో - టీసీఎస్ - ఫ్లిప్ కార్ట్ వంటి అతిపెద్ద ఐటీ సంస్థలు వారి ఉద్యోగులు యూనియన్లగా ఏర్పడటంపై ఆందోళన చెందుతున్నాయి. ఐటీ ఉద్యోగులు లేబర్ యూనియన్లగా ఏర్పడి, పారిశ్రామిక వివాదాల చట్టం 1947 కింద తమ సమస్యలను పరిష్కరించుకునే హక్కులపై ఐటీ కంపెనీలు మౌనం వహించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఏ కంపెనీకి కూడా పారిశ్రామిక వివాదాల చట్టం 1947 నుంచి తప్పించుకునే వీలులేదని, ఇతర పరిశ్రమలతో పాటు ఐటీ కంపెనీలకు ఇదే వర్తిస్తుందని సమాచారం. ఎవరైనా యూనియన్లుగా ఏర్పడొచ్చని చెబుతున్నారు.

అయితే చాలా కంపెనీలు తమ ఉద్యోగుల నుంచి ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ కు దూరంగా ఉండాలని రాతపూర్వకంగా ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలుస్తోంది. ఇటీవలే చాలా ఐటీ కంపెనీలు - ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఐఐఎమ్ - ఐఐటీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి - జాయినింగ్ తేదీలు ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమస్యలపై పోరడటానికే ఐటీ ఉద్యోగులు సంఘటితమవుతున్నారని చెబుతున్నారు. అయితే.. పోరాటాలపై ఐటీ ఉద్యోగులకు ఆసక్తి ఉన్నా కంపెనీలు వారిని ఎక్కడ బ్లాక్ లిస్ట్ లో పెడతారో అని జంకుతున్నట్టు తెలుస్తోంది. అయితే... ఇప్పటికే కొన్ని సంస్థల్లో మాత్రం సంఘాలు ఏర్పడ్డాయని చెబుతున్నారు.
Tags:    

Similar News