వాహనాలతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ హౌస్ ఫుల్ ...ఎప్పుడు ఇస్తారంటే !

Update: 2020-04-29 02:30 GMT
దేశంలో కొన్ని రాష్ట్రాలలో కరోనా మహమ్మారి ఉదృతి పెరుగుతున్నప్పటికీ , కొన్ని రాష్ట్రాలలో కరోనా తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి తగ్గుతూ వస్తున్నాయి. ఇది ఒక మంచి శుభపరిణామం అని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ మాత్రం అలసత్వం వహించకూడదు అని భావించి లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేస్తున్నారు.

కానీ, జనం మాత్రం ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. చిన్నచిన్న కారణాలతో రోడ్డు మీదకు వస్తున్నారు. అందుకే ట్రాఫిక్ పెరిగిపోతుంది. అసలు లాక్ ‌డౌన్ ‌లా అనిపించడం లేదు. ఇదే సమయంలో లాక్ ‌డౌన్‌ ఉల్లంఘన కేసులు కూడా పెరుగుతున్నాయి.. పనీపాటా లేకుండా బండేసుకుని రోడ్డు మీదకు వచ్చే వారిపై కేసులు పెట్టడమే కాకుండా వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు.

స్వాధీనం చేసుకున్న వాహనాలతో పోలీసుస్టేషన్లు నిండిపోతున్నాయి.. రోజుకు వేల సంఖ్యలో వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఇక‌పోతే సీజ్ చేసిన వెహికిల్స్ పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని..లాక్ డౌన్ ప్ర‌భుత్వం ఎప్పుడు ముగిస్తుందో అప్పుడు మాత్ర‌మే వెహిక‌ల్స్ తిరిగి వెన‌క్కి ఇవ్వ‌డం జరుగుతుంద‌ని పోలీసు అధికారులు చెప్తున్నారు. లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్-1897 ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.
Tags:    

Similar News