అమెరికాలో భారతీయులకు విషాదం అలుముకుంటూనే ఉంది. ఇటీవల కాలంలో ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఇక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతూ భారత్ లోని కన్నవారికి శోకసంద్రాన్ని మిగిలిస్తున్నారు. అమెరికాలో కేరళకు చెందిన మలయాళీ వైద్యుడి విషాదం మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
కేరళ డాక్టర్ మినీ వెట్టికల్‌కి జీవితం ఒక అద్భుత కథ కంటే తక్కువ కాదు. ఆమె బాగా చదువుకొని అమెరికాలో వైద్యురాలిగా అందరికి సేవ చేస్తూ పేరు ప్రఖ్యాతలు పొందింది. ప్రేమగల భర్త , ఐదుగురు అద్భుతమైన పిల్లలు ఉన్నారు. అంతే కాకుండా ఆమె నృత్యకారిణి.. సమాజ సేవలో ఉంది. అయితే వెట్టికల్ అకాల మరణం విషాదం నింపింది.
వెట్టికల్ మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేదు. ఆమె అకాల మరణం తర్వాత సోషల్ మీడియాలో వెల్లువెత్తిన పోస్ట్‌లతో ఆమె దేవదూత, నిస్వార్థ, వినయపూర్వకమైన , దయగల వ్యక్తిగా ప్రేమగా అందరూ జ్ఞాపకం చేసుకున్నారు. 52 ఏళ్ల ఐదుగురు పిల్లల తల్లి తన కారులో ఆస్పత్రి నుంచి నుండి ఇంటికి వస్తుండగా వేగంగా వచ్చిన మోటార్‌సైకిల్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదుపుతప్పిన డాక్టర్ వెట్టికల్ కారు ప్రమాదానికి గురైంది. ఇందులో ఆమె అక్కడికక్కడే మరణించింది. ద్విచక్రవాహనదారుడు కూడా అక్కడికక్కడే మృతి చెందాడు.
డాక్టర్ మినీ వెట్టికల్ బేలర్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ మెంబర్‌గా ఉన్నారు. ప్రధానంగా హారిస్ హెల్త్ క్లినిక్‌లలో పనిచేశారు. ఆమె పెయింటర్ , డాన్సర్ కూడా.. ఆమె పిల్లల కోసం "అత్యధిక సంఖ్యలో కేకులు పంచిపెట్టి పాపులర్ అయ్యింది. ఆమె తన చుట్టూ ఉన్న వ్యక్తులతో పంచుకునే అపారమైన ప్రేమ , కరుణకు.. ప్రథమ్ హ్యూస్టన్ మరియు హ్యూస్టన్ ఏరియా ఉమెన్స్ సెంటర్ వంటి సంస్థలలో చురుకుగా పాల్గొనడం ద్వారా నిరుపేదల కోసం ఆమె చాలా పని చేసింది.
తన తల్లిలా ఎప్పటికీ ఉండలేనని, అయితే తన తల్లి ఎప్పుడూ వారందరికీ రోల్ మోడల్‌గా ఉంటుందని ఆమె కూతురు పెద్ద పూజా వెట్టికల్ చెప్పింది. "ఆమె ఎల్లప్పుడూ తన అత్యంత ముఖ్యమైన పని కోసం సమయాన్ని వెచ్చిస్తుంది. ఒక తల్లిగా ఉండటం ఎప్పుడూ మరవలేదు" అని పూజ తన దివంగత తల్లి గురించి ఎమోషనల్ అయ్యింది. డాక్టర్ మినీ 1970లో కువైట్‌లో జన్మించారు. టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి వైద్య పట్టా పొందారు. ఆమె అంతర్గత వైద్యంలో నైపుణ్యం సాధించి అమెరికాలో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆమె మరణంతో సోషల్ మీడియాలో ఆమె గురించిన ఖ్యాతిని అందరూ గుర్తు చేసుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.