కర్ణాటక రాష్ట్రంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పరువు పోయిందని కుటుంబం మొత్తం విషం తాగి ఆత్మహత్య కి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే, కోలార్ గ్రామానికి చెందిన ఒక యువతి , యువకుడు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని తెలిసి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. అంతలోనే ఆ యువతి గర్భం దాల్చింది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే చంపేస్తారని చదువు పేరిట బయటికి వెళ్లి బిడ్డ పుట్టాకా ఇంటికి చేరుకుంది యువతి. అయితే ఆ బిడ్డను గీత అనే మహిళ వద్ద ఉంచి పెంచమని డబ్బులు ఇచ్చారు భార్యాభర్తలు. ఇరు కుటుంబాలు తమా పెళ్లిని ఒప్పుకున్నాకా బిడ్డను తీసుకెళ్తామని తెలిపారు.
ప్రతి రోజూ వీడియో కాల్, వాట్సాప్ ద్వారా బిడ్డను చూసుకుంటున్నారు తల్లిదండ్రులు. అయితే కొన్ని రోజులకు గీత మొహం చాటేసింది. బిడ్డను వీడియో కాల్, వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు చూపించకుండా రకరకాల సాకులు చెప్పడం మొదలుపెట్టింది. దీంతో అనుమానం వచ్చి గీతను కలిశారు. అయితే, ఆ బిడ్డ గీత దగ్గర లేదు. సరిగ్గా ఇక్కడే సీన్ లోకి ఎంటరైంది పుష్ప అనే మహిళ. గీత ఇంటికి దగ్గర్లోనే ఉంటుంది పుష్ప. కొన్నాళ్ల పాటు బిడ్డను చూసుకోమని పుష్పకు బిడ్డను అప్పగించింది గీత. ఈ క్రమంలో పుష్ప నుంచి కూడా బిడ్డ మాయమైంది. దీంతో భార్య , భర్తలు పోలీసుల్ని ఆశ్రయించారు. గీత, పుష్పను స్టేషన్ కు పిలిచిన పోలీసులు 5 రోజుల్లో బిడ్డను అప్పగించాలని హెచ్చరించి పంపించేశారు.
అయితే, పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికొచ్చిన వెంటనే గీత, తన కుటుంబ సభ్యులతో కలిసి పారిపోయింది. అవమానం భరించలేని పుష్ప మాత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పుష్ప, ఆమె భర్త, 17 ఏళ్ల కూతురు, పుష్ప తల్లిదండ్రులు, ఇలా అంతా కలిసి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోతూ సూసైడ్ లెటర్ రాసిపెట్టింది పుష్ప. బిడ్డను మరో వ్యక్తికి గీత అమ్మేసిందని, తన చేతుల మీదుగానే బిడ్డను వేరే వాళ్లకు అప్పగించానని ఉత్తరంలో రాసింది పుష్ప. దీంతో గుర్తించిన స్థానికులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.. కాగా అప్పటికే పుష్ప మినహా నలుగురు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు . ప్రాణాపాయ స్థితిలో ఉన్న పుష్పను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకపోవడంతో ఆమె కూడ చికిత్స పొందుతూ మృతి చెందింది.