రైలు ఆలస్యం గురించి ఉన్న సామెతలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైలు రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని కొందరు భారతీయ రైల్వే సమయపాలన గురించి తెలిసిన వాళ్లు వ్యంగ్యంగా చెబుతుంటారు. ఇలాంటి సెటైర్లకు వేదిక అయిన రైల్వేశాఖ ఇక తన పనితీరు మార్చుకోనుంది. ఆలస్యంగా నడిచే రైళ్లతో ఆందోళనకు గురయ్యే ప్రయాణికులకు కొంత ఊరట లభించనుంది. ఇకపై ప్రకటిత సమయానికి మించి రైళ్లు ఆలస్యంగా నడిస్తే సంబంధిత అధికారుల పదోన్నతులపై ప్రభావం పడుతుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ హెచ్చరించారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతవారం రైల్వే జోనల్ జనరల్ మేనేజర్లతో జరిగిన అంతర్గత సమావేశంలో పీయూష్ గోయల్ ఈ హెచ్చరికలు చేశారు. ఈ నెలాఖరులోగా సమయపాలనలో పరిస్థితి మారకపోతే రైల్వేస్టేషన్ల జనరల్ మేనేజర్లకు పదోన్నతులు కల్పించేది లేదని స్పష్టంచేశారు.
ప్రధానంగా ఉత్తర రైల్వే జీఎంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. నార్తర్న్ రీజియన్‌లో మే29 వరకు కేవలం 49.59% రైళ్లు మాత్రమే సమయానికి అనుగుణంగా నడువగా, గత ఏడాదితో పోల్చితే ఇది 32.74శాతం తగ్గింది. అన్నిజోన్లతో పోల్చిచూస్తే ఉత్తర రైల్వే అట్టడుగున ఉండటంపై పీయూష్ గోయల్ తీవ్రంగా హెచ్చరించారు. ఇదే వరుసలో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో 27% - తూర్పు రైల్వేలో 26% రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఆ రెండుజోన్ల అధికారులపైనా ఆగ్రహం వ్యక్తంచేశారు. 2017-18లో సగటున 30శాతం రైళ్లు ఆలస్యంగా నడిచినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ వేసవి సెలవుల్లోనైతే ఈ సంఖ్య మరింతగా పెరిగినట్లు సమాచారం. గత నెలలో జరిగిన ప్రగతి సమావేశంలోనూ రైళ్ల ఆలస్యంపై ప్రధాని మోదీ నుంచి పీయూష్ పలు ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది
రైళ్ల ఆలస్యం విషయమై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన ఆధారంగానే పనితీరు అంచనావేస్తామన్నారు. దేశంలో ఏ రైల్వేస్టేషన్ లోనైనా ఇలాంటి పరిస్థితి తలెత్తితే సంబంధిత స్టేషన్ సిబ్బందిపై వేటు పడుతుందని తెలిపారు. ఆలస్యంగా నడిపి ప్రయాణికుల ఆగ్రహానికి గురికావడం కంటే రైళ్లను సరైన సమయానికి నడుపడంపై దృష్టిపెట్టడం మేలన్నారు. ఇంతకాలం రైళ్ల జాప్యానికి మెయింటెనెన్స్ పనులను సాకుగా చూపారని, ఇక ఆ కారణాన్ని అంగీకరించబోమని చెప్పారు. రైళ్లు సరైన సమయానికి నడిపి రైల్వేశాఖ తన చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు. ముఖ్యంగా ప్రధాన రైల్వేస్టేషన్లలో ఇలాంటి పరిస్థితి తలెత్తితే మాత్రం ఆయా అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడానికీ వెనుకాడబోమని స్పష్టంచేశారు. సెలవుల్లో డిమాండ్ కు తగ్గట్టుగా అదనపు రైళ్లను నడిపే విషయంలోనూ జాప్యం చేయరాదన్నారు. అదనపు రైళ కేటాయింపు, రైళ్లు సమయానికి నడిచేలా చూడటం అన్నీ ఆయా రైల్వేస్టేషన్ల జీఎంలపై ఆధారపడి ఉంటుందని, స్టేషన్ సిబ్బంది కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వేస్టేషన్లో ఓ ఇనుపరాడ్ బిగించడంలో ఇంజినీర్లు విఫలమవడంతోపాటు రైల్వేశాఖకు 25లక్షల మేర నష్టాన్ని చేకూర్చారని ఆయన మండిపడ్డారు.