సంక్రాంతి.. ప్రైవేట్ బ‌స్సుల దందాపై ర‌వాణా శాఖ క‌న్ను!

Update: 2020-01-11 01:30 GMT
సంక్రాంతి.. ప్రైవేట్ బ‌స్సుల దందాకు పీక్ టైమ్. ప్ర‌తి వీకెండ్ లోనూ అయిన కాడికి టికెట్ల ధ‌ర‌ను పెంచే ప్రైవేట్ బ‌స్సు ఆప‌రేట‌ర్లు, సంక్రాంతి స‌మ‌యంలో టికెట్ రేట్స్ ను మ‌రింత‌గా పెంచేయ‌డం, వీలైనంత‌గా దండుకోవ‌డం రొటీన్ గా జ‌రిగే అంశ‌మే. ఇలాంటి నేప‌థ్యంలో ఈ సారి కూడా సంక్రాంతి సంద‌ర్భంగా అదే జ‌రుగుతూ ఉంది.

సంక్రాంతికి సొంతూళ్ల‌కు వెళ్లాల‌నే ప్ర‌యాణికుల నుంచి అయిన కాడికి దోచుకోవ‌డానికి బుకింగ్స్ ఓపెన్ చేశాయి బ‌స్సులు. ఈ నేప‌థ్యంలో ఏపీ ర‌వాణా శాఖ అధికారులు ఈ వ్య‌వ‌హారాల‌పై దృష్టి సారించారు. హైద‌రాబాద్ నుంచి ఏపీకి భారీ ఎత్తున ప్రైవేట్ బ‌స్సులు తిరుగుతాయి. అలాంటి వాటిల్లో కూడా భారీ ఎత్తున టికెట్ ధ‌ర‌ల‌ను పెంచేస్తే స‌హించేది లేద‌ని ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ పీఎస్సార్ ఆంజ‌నేయులు స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ తాము సేక‌రించిన స‌మాచారాన్ని కూడా రవాణా శాఖ వెల్ల‌డించింది. ఆర్టీసీ స్పెష‌ల్ బ‌స్సుల‌తో పోల్చినా.. ప్రైవేట్ స‌ర్వీసుల వాళ్లు చాలా  ధ‌ర ఎక్కువ పెట్టి టికెట్ల‌ను అమ్ముతున్నార‌ని ర‌వాణా శాఖ చెప్పింది. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే గుర్తించి కేసుల‌ను న‌మోదు చేస్తున్న‌ట్టుగా కూడా ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ 170 బ‌స్సుల‌ను సీజ్ చేసిన‌ట్టుగా - ఎన‌భై వాటి మీద కేసుల‌ను పెట్టిన‌ట్టుగా ర‌వాణా శాఖ ప్ర‌క‌టించింది. అలాగే.. అధిక ధ‌ర‌ల‌కు టికెట్ల‌ను అమ్ముతున్న బ‌స్సుల పై ఒక్కోదానికి 25 వేల రూపాయ‌ల జ‌రిమానాను విధించిన‌ట్టుగా ఏపీ ర‌వాణా శాఖ ప్ర‌క‌టించంది. అలాగే ట్రావెల్ బ‌స్సుల అక్ర‌మాల నివార‌ణ‌కు కాల్ సెంట‌ర్ నంబ‌ర్ ను కూడా పేర్కొన్నారు.9542800800 నంబ‌ర్ కు వాట్సాప్ ద్వారా కంప్లైంట్స్ చేయ‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News