ఒక జర్నలిస్టు పెళ్లి వార్త సంచలనంగా మారుతుంది? అదో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. చాలా మీడియా సంస్థలు సదరు పెళ్లి న్యూస్ ను కవర్ చేయటానికి పోటీ పడాల్సిన పరిస్థితి ఉంటుందా? అంటే.. నో అని టక్కున చెబుతారు. కానీ.. ఇందుకు భిన్నంగా కేరళలో జరిగిన ఆమె పెళ్లి ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. ఎందుకంటే.. ఆమె పెళ్లి రోటీన్ కు భిన్నంగా జరగటమే. కేరళలో తొలి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుగా హైది సాదియాకు పేరుంది.
ఆమె మామూలు మహిళ కాదు. ట్రాన్స్ జెండర్. అబ్బాయిగా పుట్టిన హైదీ.. తన పదిహేనో ఏట శారీరక మార్పులతో స్త్రీగా మారిపోతానని తల్లిదండ్రులకు చెబితే వారు ఇంటి నుంచి బయటకు పంపారు. ఈ సమయంలో హైదీని ఒక ట్రాన్స్ జెండర్ దగ్గరకు తీసి పెంచారు. చదువుకున్న హైదీ తర్వాతి కాలంలో కేరళలోని ఒక టీవీ చానల్ లో జర్నలిస్టుగా చేరారు.
ఉద్యోగంలో స్థిరపడటంతో ఆమె పెళ్లి చేసేందుకు పెంచిన తల్లి ప్రయత్నాలు చేశారు. ఎవరూ హైదీని పెళ్లాడటానికి ముందుకు రాలేదు. ఇలాంటివేళ ఐటీ ఇంజనీర్ అయిన అధర్వ్ మోహన్ అనే వ్యక్తి హైదీని పెళ్లాడటానికి ముందుకొచ్చారు. పక్కా కేరళ సంప్రదాయంలో సాగిన వీరి పెళ్లి హైలెట్ కావటమే కాదు.. పలు మీడియా సంస్థలు ఈ పెళ్లి వార్తను కవర్ చేయటానికి ఆసక్తిని ప్రదర్శించాయి. దీంతో.. సదరు జర్నలిస్టు పెళ్లి నేషనల్ న్యూస్ గా మారిపోయింది. దేశంలో ఒక జర్నలిస్టు పెళ్లి ఇంత సంచలనంగా మారటం.. ఈ స్థాయిలో వార్తగా మారటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
Full View