క్రిస్మస్ ఎఫెక్ట్ .... ఆ దేశంలో అప్పటివరకు అన్ని బంద్ !

Update: 2020-12-05 01:30 GMT
ప్రపంచం వ్యాప్తంగా కరోనా జోరు కొనసాగుతుంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ కరోనా కొనసాగుతుంది. దీని కారణంగా ప్రజలను ఎక్కువ మంది ఒకచోటే చేరవద్దంటూ దేశాలు నిబంధనలను పెట్టాయి. అంతేకాకుండా ప్రపంచ దేశాలు లాక్‌ డౌన్ ‌నుండి సడలింపులు కూడా ఇచ్చాడు. ప్రస్తుతం చలి కాలం కరోనా విజృంభనకు సరైన సమయం, అంతేకాకుండా ప్రపంచలో ఎక్కవమంది చేసుకునే పండగ క్రిస్మస్‌ కూడా త్వరలోనే రాబోతుంది.

ఇక ప్రజలను గుమికూడకుండా నిలువరించడం ప్రభుత్వానికి అనుకున్నంత సులువు కాదు. దీనితో ఇటలీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి జనవరి 6 వరకు ప్రయానాలను నిలిపివేసింది. కరోనాను కట్టడి చేసేందుకు తీసుకున్న ఈ నిర్ణయం కొంతమేర ఫలితం ఇస్తుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. మనం ఎక్కడ మన రక్షణను తగ్గించే ప్రసక్తే లేదని దేవ ప్రధాని గిసియేప్ కాంటే అన్నారు.

కరోనాను మనం ఎలాగైనా ఎదుర్కోవాలి. కరోనా మూడో విడత దేశంలో చొరబడటానికి ఎటువంటి ఆస్కారం ఇవ్వకూడదు. మూడో విడత కచ్చితంగా మొదటి, రెండవ వాటికన్నా దారుణంగా ఉండే అవకాశం లేకపోలేదు. దీనిని ఎదుర్కునేందుక అనేక చర్చలను చేశాం. చివరకు ప్రయానాలను నిలువరించేందుకు నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది క్రిస్మస్‌కు కుంటుంబ సభ్యులందరూ కలిసి పండుగను జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది చాలా మంది తమ కుటుంబాలకు దూరంగా వేడుకను చేసుకోనున్నారు. ఇది కేవలం ప్రజలను రక్షించేందుకే అన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇటలీ 58వేలను కరోనా కేసుల సంఖ్యను దాటింది.
Tags:    

Similar News