ఫ్రెండ్ కోసం 300 కీ.మీ. వెళ్లింది.. ఆ తరువాత అత్యాచారానికి గురైంది..

Update: 2021-09-12 05:39 GMT
ఓ వైపు ఆన్ లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నా.. మరోవైపు బాధితులు పెరుగుతూనే ఉన్నారు.  నెట్ వాడకం పెరిగిన తరువాత ప్రపంచాన్ని అరచేతిలో చూస్తున్నారు. ఈ క్రమంలో కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటూ వారితో ప్రెండ్షిప్ చేస్తున్నారు. కళ్లముందు కనిపించేవారినే నమ్మే స్థితిలో లేని సమయంలో ఆన్ లైన్లో ఉన్నవారిని కొందరు యువతులు నమ్మి వారి చేతిలో అభాసుపాలవుతున్నారు. కనిపెంచిన తల్లిదండ్రులను కాదని ఆన్లైన్లో పరిచయం అయిన ఓ వ్యక్తి కోసం కేరళకు చెందిన ఓ యువతి 300 కిలోమీటర్లు వెళ్లింది. ఆ తరువాత అతని చేతిలో దారుణంగా మోసపోయింది. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయాలు బయటకువ వచ్చాయి.

కేరళలోని కొల్లాంకు చెందిన ఓ యువతి అందరిలాగే ఆన్లైన్లో ఎక్కువగా సమయం గడిపేది. ఈ క్రమంలో నెట్టింట్లో ఆమెకు కోజికోడ్ కు చెందిన హాసన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ముందుగా మంచి వారిలా నటించి తియ్యగా చాటింగ్ చేశాడు. అతని మాటలకు ఆ యువతి ఆకర్షితులయింది. ఆ తరువాత అతడు చెప్పే మాయమాటలను నమ్మింది. తన మీద ప్రేముంటే తన దగ్గరికి రావాలని చెప్పాడు. దీంతో ఆ యువతి కోజికోడ్ అంటే కొల్లాం నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి గురువారం అతని దగ్గరికి చేరుకుంది.

యువతిని కలుసుకున్న హాసన్ ఆమెను ఓ హోటల్ కు తీసుకెళ్లాడు. కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఆ తరువాత హాసన్ స్నేహితులు ఇద్దరు వచ్చారు. అయితే యువతి వారి గురించి అడగగా తన ప్రాణ స్నేహితులని, తనను పరిచయం చేసేందుకే ఇక్కడికి రమ్మన్నానని చెప్పాడు. దీంతో యువతి ఏమీ మాట్లడాలేదు. ఆ తరువాత సరదాగా మద్యం తాగాలని హాసన్ యువతిని బలవంతం చేశాడు. దీంతో బలతవంతంగానే ఆమె మద్యం సేవించింది. ఆ తరువాత ఆమకు డ్రగ్స్ కూడా ఇచ్చారు. దీంతో యువతి మత్తులోకి వెళ్లిపోయింది. ఆ తరువాత హాసన్ తో పాటు మరో ఇద్దరు ఒకరి తరువాత ఒకరు ఆమెపై హత్యాచారం చేశారు.

వారు చేసిన అత్యాచారాన్ని వీడియోలు, ఫొటోలు తీశారు. అయితే కాసేపటి తరువాత యువతి అన్ కండిషన్లోకి వెళ్తుందని తెలుసుకున్న తరువాత ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే తన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. అయితే ఆ యువతి తనపై జరిగిన దారుణం గురించి పోలీసులకు చెరప్పింది. పోలీసులు ఆమె దగ్గరి నుంచి వాంగ్మూలం తీసుకొని నిందితుడి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగా హాసన్ ను అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.

కాలేజీలో పరిచయమైన స్నేహితులే మోసం చేస్తున్న ఈరోజుల్లో ఆన్ లైన్ ఫ్రెండ్సిప్ పేరిట చాలా మంది యువతులు మోసపోతున్నారని పోలీసులు చెబుతున్నారు. మంచి అవసరాల కోసం నెట్ ను వాడుకోవాలని ఇలాంటి పనుల వల్ల యువతుల జీవితం నాశనం కావడమే కాకుండా తల్లిదండ్రులకు తలవంపులు వస్తాయని పోలీసులు తెలుపుతున్నారు. ఆన్లైన్ ఫ్రెండ్సిప్ ను అస్సలు నమ్మొద్దని, ఇలాంటివి ఎన్నిటికైనా ప్రమాదమేనని అంటున్నారు. ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఏమీ రాదని, చక్కగా చదువుకొని భవిష్యత్ వైపు అడుగులు వేయాలని సూచిస్తున్నారు. మరోవైపు ఆన్లైన్లో పరిచయమైన యువతులను మోసం చేసే వారిని వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నారు. యువత చెడు మార్గాలు పట్టకుండా మంచి మార్గంలో వెళ్లాలని, ఒక్కసారి జైలుకు వెళితే వారు జీవితాంతం నష్టపోవాల్సి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
Tags:    

Similar News