ఒక ప్రేయసి.. ఇద్ద‌రు ప్రియులు.. క‌ట్ చేస్తే మార‌ణ కాండ‌!

Update: 2022-11-18 01:30 GMT
ఒక అమ్మాయిని ఇద్ద‌రు యువ‌కులు ప్రేమించారు. ఇదేం సినిమా కాదు. నిజ‌మే! అయితే, ఈ ఇద్ద‌రు యువ‌కులు కూడా.. త్యాగానికి బ‌దులుగా ప్ర‌తీకారానికి దిగారు. నాకంటే నాకే కావాలంటూ.. ఆ అమ్మాయి కోసం దారుణానికి దిగారు. పంజాబ్‌లో జ‌రిగిన చిన్న సంఘ‌ట‌న‌ను ప‌రిశోధిస్తే.. అతి పెద్ద భ‌యంక‌ర‌మైన నిజం వెలుగు చూసింది.

లవ్ ట్రయాంగిల్లో చిక్కుకున్న స్నేహితులు శత్రువులుగా మరారు. ఇంత కాలం కలిసి మెలిసి తిరిగిన ఆ ఇద్దరిలో ఒక్కరు ఇప్పుడు విగతజీవి అయ్యాడు. ప్రేమ కోసం ఓ వ్యక్తి తన స్నేహితుడినే హతమార్చిన ఘటన పంజాబ్లోని జలంధర్లో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం... బిహార్కు చెందిన ముహమ్మద్ షామిమ్ అనే వ్యక్తి పంజాబ్‌లోని గాడీపుర్లోని ఓ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. అతనితో పాటు మొహమ్మద్ అష్ఫాక్ అనే వ్యక్తి కూడా అదే ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఇద్దరూ అక్కడే ఉన్న ఓ క్వార్టర్స్లో నివసిస్తున్నారు. అదే ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళను షామీమ్ ప్రేమించగా.. అఫ్షాక్ సైతం ఆమెను ప్రేమించాడు.

మహిళను ప్రేమిస్తున్న విషయాన్ని షామిమ్ తన స్నేహితుడు అష్ఫాక్తో చెప్పాడు. అయినప్పటికీ.. అష్ఫాక్.. ఆ మహిళపై మనసుపారేసుకున్నాడు. ఈ విషయమై తరచూ వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగేది. ఈ క్రమంలో తాజాగా ఆ ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా.. షామిను అష్ఫాక్ హత్య చేశాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకూదడని ఆ మృతదేహాన్ని ఓ సూట్కేస్లో పెట్టి జలంధర్ రైల్వేస్టేషన్లో వదిలి వెళ్లాడు.

 ఆ సూట్కేసును గుర్తించిన ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో మృతదేహం ఉండటం చూసి పోలీసులు షాకయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు.. నిందితుడిని ఇట్టే పట్టేసి అదుపులోకి తీసుకున్నారు. ఇంత జ‌రుగుతున్నా.. ఆ ప్రియురాలు మాత్రం త‌న‌కు ఎవ‌రూ ఇష్టం లేద‌ని.. తాను ఎవరితోనూ అసలు మాట్లాడ‌లేద‌ని పోలీసుల‌కు చెప్పి.. త‌ప్పించుకోవ‌డం కొస‌మెరుపు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News