గిరిజనుల కరోనా మాస్క్‌ లు చూశారా..!

Update: 2020-03-27 03:30 GMT
ఇక్కడ అక్కడ అని కాకుండా.. వాళ్లకు వీళ్లకు అని కాకుండా దాదాపు అందరికి కూడా కరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెల్సిందే. చైనా.. ఇటలీ.. అమెరికా దేశాలు ఎదుర్కొన్న పరిస్థితులు ఇండియాకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వాలు సాధ్యం అయినంతగా అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరంను పాటించడంతో పాటు బయటకు వెళ్తే ఖచ్చితంగా మాస్క్‌ లను ధరించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌ ఘడ్‌ కు చెందిన గిరిజన జనాలు కరోనా భయంతో వాడుతున్న మాస్క్‌ లు వైరల్‌ అవుతున్నాయి.

గిరిజనులు డబ్బుతో మాస్క్‌ లు కొనుగోలు చేసే స్తోమత లేకపోవడంతో అందుబాటులో ఉన్న తాటాకులను మాస్క్‌ లుగా తయారు చేసుకున్నారు. తాటాకు మాస్క్‌ లు ధరించే వారు బయట తిరుగుతున్నారు. ఛత్తీస్‌ గడ్‌ లోని బస్తర్‌ జిల్లాలోని పలు మారుమూల గిరిజన గ్రామాలకు చెందిన వారు ఇలా తాటాకుల మాస్క్‌ లు ధరించి తమను తాము రక్షించుకుంటున్నారు.

మాస్క్‌ లు అందుబాటులో లేని వారు ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మాస్క్‌ లు ఉండి కూడా కొందరు జాగ్రత్తలు పడటం లేదు. మాస్క్‌ లు పెట్టుకోకుండా బయట తిరగిగే వారికి వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు.


Tags:    

Similar News