వైసీపీలో సరికొత్త ఫైర్ బ్రాండ్ లేడీ లీడర్ గా ఎదుగుతున్న గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ ఇప్పుడు నిజంగానే బుక్కైపోయారు. జాతిపిత మహాత్మా గాంధీ 150 జయంతి సందర్బంగా తనదైన శైలి స్పీచ్ దంచేసిన రజనీ... గాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్నామని, అంటే ఇప్పటికి గాందీ జన్మించి 70 ఏళ్లు అవుతోందంటూ తనదైన మార్కు లెక్కలు చెప్పారు. ఓ ఎమ్మెల్యేగా ఉన్న రజనీ చెప్పిన ఈ లెక్క... వెనువెంటనే వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో జనం ఆమెను ఏకి పారేశారు. ‘ఓ ఎమ్మెల్యేగా ఉన్న మీకు లెక్కలు బాగానే వచ్చేశాయి. అయితే మీ మార్కు లెక్కలు మాకు మాత్రం నేర్పించమాకండి’ అంటూ అప్పుడే జనం రజనీ మీద విరుచుకుపడినంత పనిచేశారు. సరే... ఏదో పొరపాటో, గ్రహపాటో... అలా జరిగిపోయిందిలే అన్న భావనతో రజనీపై విమర్శలు గుప్పించిన నెటిజన్లు ఇక ఆమెను వదిలేద్దామనుకున్నారు. అయితే నాడు ఆమె చెప్పిన లెక్కలు... తరచితరచి చూస్తున్న నెటిజన్లు ఇప్పటికీ ఆమెను ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్న వైనం చూస్తుంటే... ఈ ట్రోలింగ్ దెబ్బకు రజనీ దెబ్బైపోవడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.
అసలు గాంధీ జయంతి రోజున రజనీ ఏం మాట్లాడారన్న విషయానికి వస్తే... ‘ప్రస్తుతం మనం గాంధీ 150వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఈ లెక్కన గాంధీ జన్మించి ఇప్పటికి 70 ఏళ్లు అవుతోంది’ అంటూ రజనీ తనదైన శైలిలో ప్రసంగం చేశారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆమె ఎలాంటి తొట్రుపాటు లేకుండానే చాలా స్పష్టంగా మాట్లాడారు. తన నోట నుంచి పొరపాటు దొర్లిందని రజనీ గ్రహించలేదు. అంతేకాకుండా ఆమె అనుచరులు కూడా ఇది తప్పని వారించనూ లేదు. దీంతో రజనీ కూడా చాలా నార్మల్ గా ప్రసంగం ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమె అటు వెళ్లారో లేదో... గాంధీ 150 వర్ధంతి అంటే... గాంధీ పుట్టి ఇప్పటికి 70 ఏళ్లు అవుతోందంటూ చెప్పిన డైలాగులతో కూడిన వీడియో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గానే మారిపోయింది.
తాజాగా కొందరు నెటిజన్లు... రజనీ వీడియో పై మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ అంటే మోహన్ దాస్ కరం చంద్ గాంధీ తల్లి... అంటూ రజనీని ఓ రేంజిలో ట్రోల్ చేయడం మొదలెట్టేశారు. అయినా ఓ ఎమ్మెల్యేగా ఉన్న మీకు మహాత్మా గాంధీ గురించిన వివరాలే తెలియకుంటే ఎలా? 150వ వర్థంతి అంటే ఆయన పుట్టి ఇప్పటికి 70 ఏళ్లు ఎలా అవుతుంది? అదే మహాత్ముడి ప్లేస్ లో మీ మహానేతను స్మరించుకుని మహాత్ముడి 150 జయంతి అంటే.. .వైఎస్ జన్మించి ఇప్పటికి 70 ఏళ్లు అవుతోందని అనుకుంటున్నారా? అంటూ రజనీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈ నెల 2న రజనీ మాట్లాడితే... ఇప్పటికీ ఆమె స్పీచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉండటం, ఈ వీడియోను చూసి నెటిజన్లు కొత్త కొత్త కామెంట్లతో రజనీని ట్రోల్ చేయడం చూస్తుంటే... రజనీ పై ట్రోలింగ్ ఇప్పుడిప్పుడే ఆగేలా లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Full View