కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు.. ప్రస్తుత బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయబడ్డారు. ఇటీవల బీసీసీఐ టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ పొట్టి ఫార్మాట్ టోర్నమెంట్ కోసం బీసీసీఐ మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీని టీమిండియాకు సూచనలు, సలహాలు ఇచ్చే మెంటర్ గా ఎంపిక చేసింది.
టీ 20 వరల్డ్ కప్ కోసం టీమిండియాకు మెంటార్‌గా వ్యవహరించాలన్న బీసీసీఐ అభ్యర్థనను ధోనీ అంగీకరించారని, ధోనీ టీమిండియాతో ఉన్నందుకు క్రికెట్ టీం సంతోషంగా ఉందని జే షా ప్రకటించారు. అయితే ఇంగ్లీష్ లో ఈ ప్రకటన చేసిన అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటనను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆయన భాష పటిమ సామర్థ్యాలపై ఎద్దేవా చేస్తున్నారు. జై షా ప్రసంగం సొంతంగా చెప్పలేదని.. కింద టెలిప్రొమ్ప్టర్ గా అక్షరాలు చూసి చదివాడని పలువురు ట్విట్టర్ లో చేస్తున్నారు. అందుకే అతని ప్రసంగం అంత సాఫీగా లేదని ఎద్దేవా చేస్తున్నారు..
సంగీత దర్శకుడు విశాల్ దడ్లాని నుంచి ప్రముఖ న్యాయవాది, నేత ప్రశాంత్ భూషణ్ వరకు చాలా మంది జైషా ప్రసంగ వీడియోను ట్రోల్ చేసారు. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇలా రాసుకొచ్చాడు. “ఎంత మధురమైన & అమాయకమైన అబ్బాయి! అతను బీసీసీఐకి బాస్. అతడి పేరు జై షా. వాస్తవానికి బిజెపిలో రాజకీయ వారసత్వం లేదు.. ఇక బిసిసిఐలో రాజకీయ జోక్యం లేదు " అంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేత బ్రిజేష్ కాలప్ప ట్వీట్ చేస్తూ, “జే షా క్రికెటర్ కాదు, రీడింగ్ టెస్ట్‌లో కూడా పాస్ కాలేడు. అతను ఏ ప్రయోజనం కోసం బిసిసిఐ కార్యదర్శిగా నియమించబడ్డాడు?’ అని ఎద్దేవా చేశారు.
మ్యూజిక్ కంపోజర్ విశాల్ ట్వీట్ చేస్తూ “ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యాన్ని బట్టి మనిషిని అంచనా వేయడం సరికాదు. అతను బీసీసీఐ అధిపతి. అతని క్రికెట్ రికార్డు ద్వారా నిర్ధారించండి. వాస్తవానికి, అన్ని క్రీడా-అసోసియేషన్ అధిపతులు వారి క్రీడలలో వారి నైపుణ్యం ద్వారా తీర్పు ఇవ్వండి. అంతర్జాతీయంగా మనం చేయాల్సినంతగా ఎందుకు చేయలేదో అప్పుడు గ్రహించండి’ అంటూ అమిత్ షా కుమారుడిని సపోర్టు చేసే వారు కూడా ఉన్నారు. ఆశ్చర్యకరంగా బిజెపి సోషల్ మీడియా సైన్యం ఈ ట్రోల్స్‌పై మౌనంగా ఉంది.

What a sweet & innocent boy! He is the boss of BCCI. He is named Jay Shah. Of course there is no dynasty in BJP nor political interference in BCCI pic.twitter.com/jJ5lYvJsLt
— Prashant Bhushan (@pbhushan1) September 9, 2021