గ్రేటర్ హైదరాబాద్ లో మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువగా అందరి చూపును తనవైపు తిప్పుకొన్న కూకట్ పల్లి నియోజకవర్గంలో ప్రచార పదనిసలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ అనూహ్య రాజకీయాల్లో భాగంగా దివంగత సీనియర్ నేత నందమూరి హరికృష్ణ తనయ నందమూరి సుహాసిని బరిలో ఉన్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీఆర్ ఎస్ లో చేరిన నేపథ్యంలో సెటలర్ల ఓట్లపై భరోసాతో టీడీపీ వారి ఓట్లపై భరోసాతో ఉంది. కాగా, ఈ ఎన్నికల ప్రచారంలో సుహాసినికి చిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయని అంటున్నారు. తాజాగా, టీఆర్ ఎస్ - టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర కలకలం రేపడం సంచలనంగా మారింది.
కూకట్ పల్లిలోని అల్లాపూర్ డివిజన్ లో సోమవారం సుహాసిని ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో టీఆర్ ఎస్ కార్యాలయం నుంచి ఆమె వెళుతుండగా - టీఆర్ ఎస్ కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారని సమాచారం. దీంతో టీడీపీ శ్రేణులు సైతం ప్రతిఘటన చేశాయి. రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలో పోలీసులు రంగప్రేవశం చేసి సద్దుమణిగించారు. కాగా, సుహాసిని అర్ధాంతరంగా ప్రచారం ముగించారు. మరోవైపు సుహాసిని ప్రచారానికి ఆమె సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ - తారక్ రాక పై టీడీపీ శ్రేణులు ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పటికే కూకట్ పల్లిలోని కాంగ్రెస్ నేతలు తాము టీడీపీకి మద్దతు ఇవ్వలేమని ప్రకటించాయి. కాంగ్రెస్ కు ఈ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఇస్తారనుకుంటే...టీడీపీకి ఇచ్చారని సుహాసినికి తాము మద్దతు ఇవ్వబోమని వారు ప్రకటించారు. ఖచ్చితంగా ఆమెను ఓడిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుహాసిని గట్టి ఫైట్ ఎదుర్కుంటున్నారు.