ఉద్యమ సమయంలో పదవుల్ని ఆశించిన వారెవరూ టీఆర్ ఎస్ వైపు చూసే వారు కాదు. ఆ పార్టీలో చేరితో రోజూ రోడ్ల మీదకు రావటం తప్పించి.. అధికారం వచ్చే అవకాశమే లేదు. తెలంగాణ వాదం మీద విపరీతమైన నమ్మకం ఉన్న వారు పార్టీలో చేరేవారు. తమ జీవితకాలంలో తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితేనే అదే పెద్ద పదవిగా ఫీలైన నేతలు చాలామందే ఉండేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. మిగిలిన రాజకీయ పార్టీల్లో లేని ఒక చిత్రమైన వాతావరణం నాటి టీఆర్ ఎస్ లో కనిపించేది. భావోద్వేగంతో ఊగిపోతూ.. తెలంగాణకు జరగాల్సిన న్యాయం గురించి వారు తీవ్రంగా మాట్లాడేవారు.
అయితే.. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో పార్టీని నమ్ముకున్న నేతలు.. కింది స్థాయి కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నిజం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన తర్వాత కూడా పదవుల గురించి ఆలోచించినోళ్లు తక్కువే. ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి.. పవర్ చేతికి వచ్చాక తమ కష్టాలు తీరాయని.. తాము చేసిన పోరాటాలకు ప్రయోజనం దక్కనుందని.. తాము కలలు కన్న తెలంగాణ సాకారమైన నేపథ్యంలో తమకు పదవులు లభిస్తాయని ఆశించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టి 25 నెలలు దాటుతున్నా.. నామినేటెడ్ పోస్టులు దక్కని పరిస్థితి. ఎప్పటికి వస్తాయో అర్థం కాని దుస్థితి. అదేమంటే.. తొమ్మిది.. పదో షెడ్యూల్ లలో మెజార్టీ కార్పొరేషన్లు ఉన్న నేపథ్యంలో వీటికి సంబంధించి ఉద్యోగుల విభజన.. ఆస్తుల పంపకం జరగని నేపథ్యంలో మరికొంత కాలం వెయిట్ చేయాలన్న మాటలతో కాలక్షేపం చేసే పరిస్థితి.
అలా అని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదా? అంటే కొన్నింటిని చేశారని చెప్పాలి. అవకాశం ఉన్న వాటి విషయంలోనే ఆలస్యం చేసిన కేసీఆర్ సర్కారు.. ఇక.. అమలు సాధ్యం కాని విషయం గురించి పెద్దగా పట్టించుకోని పరిస్థితి. హైకోర్టు విభజన మీద తరచూ గళం విప్పి.. కేంద్ర స్థాయిలో ఫైటింగ్ చేస్తున్న కేసీఆర్ అండ్ కో తొమ్మిది.. పదో షెడ్యూల్ లో ఉన్న సంస్థల్లో విభజన విషయం మీద బలంగా గళం విప్పితే ఇష్యూ క్లోజ్ కాదా? అంటూ ప్రశ్నించేవారికి సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితి.
కొన్ని సంస్థలకు తన విధేయులకు పదవులు అప్పజెప్పిన కేసీఆర్.. ఇటీవల తన రాజకీయ కార్యదర్శి సుభాష్ రెడ్డిని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత నిర్ణయం తీసుకోవటానికి అవకాశం ఉంటే.. అంతకు ముందు కూడా ఈ ఎంపిక చేసే వీలుంది.కానీ.. అలా చేయకుండా ఉండటమే కేసీఆర్ మార్క్ రాజకీయంగా చెప్పొచ్చు. నామినేటెడ్ పదవుల కోసం ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేస్తుండటం.. ఎప్పటికప్పుడు ఏదో ఒక వాదనను తెర మీదకు తీసుకొచ్చి.. అది పూర్తయ్యాక పదవుల పందేరం ఉంటుందని చెప్పినా.. అలాంటిదేమీ చోటు చేసుకున్న పరిస్థితి.
ప్రస్తుతం ముఖ్యమంత్రి కొత్త జిల్లాల నిర్మాణం మీద దృష్టి పెట్టారని.. ఆ ప్రక్రియ పూర్తి అయ్యాక ఫ్రెష్ గా పదవుల పంపిణీ ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా అలా జరిగే ఛాన్స్ ఉంటుందా? అంటే సందేహమే అని చెబుతున్నారు. మరో ఏడాది.. ఏడాదిన్నర వరకూ పదవుల పందేరం ఉండదన్న వాదనను కొన్ని వర్గాలు వ్యక్తం చేయటం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల ముందు అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు ఇచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.
ఎన్నో అన్యాయాల మీద గళం విప్పే తమకే అన్యాయం జరుగుతున్నా.. నోరు విప్పలేకపోతున్నామంటూ లోగుట్టుగా నేతల మాటలు వింటే వారెంత ఫస్ట్రేషన్ లో ఉన్నారో తెలుస్తుంది. నామినేటెడ్ పోస్టుల కోసం ద్వితీయ.. తృతీయ శ్రేణి ఉద్యోగులు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నా.. కనికరించని అధినేత మీద మింగాలేక.. కక్కా లేక కిందామీదా పడే పరిస్థితి. నోరు జారితే శాశ్వితంగా అవకాశాలు మూసుకుపోతాయన్న భయమే.. నేతల నోటిని తెరవనీయటం లేదని చెప్పొచ్చు. రెండేళ్లు అయినా హైకోర్టు విభజన చేయరే? అంటూ గళం విప్పే కేసీఆర్ అండ్ కో.. తమను నమ్ముకున్న ఎంతోమంది నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారని.. వారికి ఆ పదవులు ఇవ్వలేకపోయామన్న ఆత్మవిమర్శను చేసుకోరా? అన్న న్యాయమైన ప్రశ్నకు సమాధానం ఇచ్చే వారెవరు..?