ఆపరేషన్ ఆకర్ష్ తో ఇబ్బడి ముబ్బడిగా నేతలను చేర్చుకున్న టీఆర్ ఎస్ పార్టీకి ఇప్పుడు వారిని ఒక్కతాటిపై ఉంచడం చాలా కష్టమవుతోంది. గులాబీ పార్టీలో ఇప్పుడు ఇంటిపోరు ఎన్నికల వేళ పతాక శీర్షికన ఉంది.
నాగర్ కర్నూలు జిల్లాలోకి కల్వకుర్తి నియోజకవర్గంలో వర్గపోరు టీఆర్ ఎస్ ను కలవరపెడుతోంది. ఇక్కడ ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ తీరు పార్టీకి గుబులు రేపుతోంది. తాజాగా ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఆ ఇద్దరి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మధ్య విభేధాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఉన్నాయి. ఇద్దరు నేతల వర్గీయులు రోడ్డెక్కి కొట్టుకోవడం టీఆర్ ఎస్ పార్టీని కలవరపెట్టాయి. తాజాగా మరోసారి అలాంటి కొట్లాటే పునరావృతమైంది.
నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి రాములుకు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అనుచరులు అడ్డుకున్నారు. ప్రచార వాహనంపై ఎమ్మెల్యే ఫొటో లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టి ఐదుగురిని అడుపులోకి తీసుకున్నారు.
కసిరెడ్డి వర్సెస్ జైపాల్ యాదవ్ మధ్య ఆదిపత్య పోరు ఎన్నో ఏళ్లుగా ఉంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రంగంలోకి దిగి వీరిద్దరికీ సర్ధి చెప్పినా వీరు తీరు మార్చుకోలేదు. కల్వకూర్తి ఎమ్మెల్యే టికెట్ కోసం వీరు సాగించిన పోరే వీరి మధ్య యుద్ధానికి కారణమైంది.