కారు నిండి పోయింది.. ఓవర్ లోడ్ అయిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ లో తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్న టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నుంచి గెలిచిన వారు, ఓడిన నేతలు అందరూ వచ్చి కారు ఎక్కేశారు. దీంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ ఆది నుంచి టీఆర్ఎస్ లో ఉన్న వారు తమకే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వలస వచ్చిన నేతలు లేదు తమకేనంటూ డబ్బులు వెదజల్లుతున్నారు. దీంతో అధికార టీఆర్ఎస్ కు ఇప్పుడు రెబల్స్ బెడద పట్టిపీడిస్తోంది.
నేతలతో ఓవర్ ఫుల్ అయిన గులాబీ పార్టీకి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో తగిన అభ్యర్థులను ఎన్నుకోవడం పెద్ద టాస్క్ గా మారింది. ఎందుకంటే ప్రతీ వార్డు, డివిజన్ లో కనీసం ఐదుగురు ఆశావహులు టికెట్లు డిమాండ్ చేస్తుండడంతో టీఆర్ఎస్ అధిష్టానం తలపట్టుకుంది. రెబల్స్ బెడద తో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిణామం టీఆర్ఎస్ ను మున్సిపల్ ఎన్నికల్లో ఎంత మేరకు దెబ్బతీస్తుందోనన్న ఆందోళన గులాబీ పార్టీని పట్టిపీడిస్తోందట.. అధికార పార్టీలోకి భారీగా చేరిన ఎమ్మెల్యేల భవిష్యత్తు కు ఇది పరీక్ష గా మారింది.
ప్రస్తుతం ఆర్థికంగా బాగా ఖర్చు పెట్టగలిగిన వారికే టీఆర్ఎస్ టికెట్లు దక్కేలా ఉన్నాయి. మిగతా వారంతా బీజేపీ, కాంగ్రెస్ బాట పట్టి టీఆర్ఎస్ ను దెబ్బతీసేలానే కనిపిస్తున్నారు. అయితే టికెట్ దక్కని వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని.. తొందర పడవద్దని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆశచూపుతున్నారు. కానీ ఇది ఎంత వరకు ఫలిస్తుందనేది వేచి చూడాలి.
అయితే తిరుగుబాటు అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని గులాబీ పార్టీ హెచ్చరిస్తున్నా రాజకీయ భవిష్యత్తు కంటే తమకు ఏది ఎక్కువ కాదని వారంతా పోటీచేయడానికే రెడీ అవుతున్నారు. ఇక కొంతమంది టీఆర్ఎస్ భయానికి వెనక్కి తగ్గినా వారు ఎంపిక చేసిన అభ్యర్థికి మద్దతిస్తారనే నమ్మకం లేదు. దీంతో ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.