అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం రాష్ట్రం లోనే కాదు దేశాల రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. 88 స్థానాలు కైవసం చేసుకోవడం, హరీష్ రావుతోపాటు పలువురి అభ్యర్థులు భారీ మెజార్టీ వంటి అంశాలు ఆ పార్టీకి తిరుగు లేదని చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయాన్ని నమోదు చేస్తుందని చెప్పిన రిపబ్లిక్ - సీ ఓటర్ సర్వే తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తురనే విషయాన్ని బయటపెట్టింది. లోక్ సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వే వెల్లడించింది.
ప్రస్తతం టీఆర్ఎస్ గాలి జోరుగా వీస్తుండడంతో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలకు ఒక్క లోక్ సభ సీటు కూడా దక్కదని సర్వే చెబుతోంది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో 16 టీఆర్ఎస్ గెలుచుకుంటుందని, మిగిలిన ఒక్కటి ఎంఐఎం వశమవుతుందని స్పష్టం చేసింది.
పార్లమెంట్ ఎన్నికల్లో 42.4 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే చెబుతోంది. అందులో కాంగ్రెస్ , టీడీపీ కూటమికి 29.1 శాతం, బీజేపీకి 12.6 శాతం, ఎంఐఎం కు 4.7శాతం, ఇతరులకు 11.3శాతం ఓట్లు వస్తాయని రిపబ్లిక్ టీవీ సీఓటరు సర్వే వెల్లడించింది. నవంబరులో వెల్లడించిన సర్వేలో మాత్రం టీఆర్ఎస్ కు తొమ్మిది స్థానాలు, కాంగ్రెస్, టీడీపీ కూటమికి ఆరు, బీజేపీ, ఎంఐఎంకు చెరో సీటు దక్కుతాయని ఈ సర్వే పేర్కొనడం విశేషం.