ఆర్టీసీ స‌మ్మెపై ఎస్మా అస్త్రం!

Update: 2018-06-09 05:37 GMT
ప‌ట్టుద‌ల‌.. మొండిత‌నం కాస్త ఎక్కువ‌గా ఉండే ముఖ్య‌మంత్రులు త‌మ నోటి నుంచి వ‌చ్చిన మాట జ‌ర‌గ‌కుంటే దాన్ని వ్య‌క్తిగ‌తంగా తీసుకున్న ఉదంతాలు బోలెడ‌న్ని క‌నిపిస్తాయి. తాజాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మార‌టం తెలిసిందే.

ఊహించ‌ని రీతిలో సీఎం రియాక్ష‌న్ ఉండ‌టంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఒక్క‌సారి షాక్ తిన్నాయి. సీఎం హెచ్చ‌రిక‌ల‌కు త‌లొగ్గి స‌మ్మెపై వెన‌క‌డుగు వేస్తే.. అది కాస్తా త‌మ ఉనికికే ప్ర‌మాదంగా కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. అంతేకాదు.. ఇలాంటి బెదిరింపులు ప్ర‌భుత్వానికే న‌ష్టం త‌ప్పించి త‌మ‌కు కాద‌న్న భావ‌న వారిలో వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. ప్ర‌భుత్వ ఆలోచ‌న‌లు మ‌రోలా ఉన్నాయి.

తాము చెప్పిన త‌ర్వాత కూడా స‌మ్మె విర‌మ‌ణ దిశ‌గా ఆలోచించ‌కుండా..స‌మ్మె చేస్తామ‌ని చెప్ప‌టమంటే సీఎం మాట‌కు విలువ ఇవ్వ‌క‌పోవ‌ట‌మేన‌న్న వాద‌న‌ను వినిపిస్తున్నారు. సీఎం చెప్పిన త‌ర్వాత కూడా స‌మ్మెపై వెన‌క్కి తగ్గ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తే.. ఉద్యోగుల‌పై ఎస్మా అస్త్రాన్ని ప్ర‌యోగించాల‌న్న నిర్ణ‌యం దిశ‌గా ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది.

ముఖ్య‌మంత్రి రియాక్ష‌న్ నేప‌థ్యంలో ప్ర‌స్తుతానికి స‌మ్మెను విర‌మించాల‌ని.. కనీసం వాయిదా వేయాల‌ని ఆర్టీసీ మంత్రి కోరారు. అయితే.. ఇందుకు కార్మిక సంఘాల నేత‌లు నో చెప్పేశాయి. స‌మ్మె విష‌యంలో కార్మిక సంఘాలు వెన‌క్కి త‌గ్గ‌కుంటే.. ప్ర‌భుత్వం దీనిపై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని భావిస్తోంది.

స‌మ్మెకు దిగితే ఆర్టీసీ కార్మిక నేత‌ల్ని ఎక్క‌డిక‌క్క‌డ అరెస్టులు చేయాల‌ని.. కేసులు పెట్టాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ నెల 11 నుంచి స‌మ్మెకు వెళ్లాల‌ని భావిస్తున్న నేప‌థ్యంలో.. ఆర్టీసీ గుర్తింపు సంఘాల్ని ప్ర‌భుత్వం ర‌ద్దు చేసే అవ‌కాశం ఉందంటున్నారు. కార్మిక సంఘాల్ని ర‌ద్దు చేసి.. సంఘాల నేత‌ల్ని అరెస్ట్ చేయ‌టం ద్వారా స‌మ్మె విష‌యంలో క‌ఠిన వైఖ‌రిని ప్ర‌ద‌ర్శించాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఆర్టీసీ డిపోల ద‌గ్గ‌ర భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసి.. బ‌స్సుల్ని బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా అడ్డుకునే వారిని వెంట‌నే అరెస్ట్ చేయాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. శుక్ర‌వారం చోటు చేసుకున్న ప‌రిణామాల్ని చూస్తే.. మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డితో కార్మిక సంఘాల నేత‌లు జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. ప్ర‌భుత్వ ప‌రంగా హామీని ఇస్తే స‌మ్మె విష‌యంలో పున‌రాలోచ‌న చేస్తామ‌ని చెప్పినా.. మంత్రి నుంచి ఎలాంటి హామీ రాలేదు. కార్మిక సంఘాలతో మంత్రి మాట్లాడిన స‌మ‌యంలోనూ ఆర్టీసీ విష‌యంలో ముఖ్య‌మంత్రి నోటి నుంచి ఏ త‌ర‌హా మాట‌లు వ‌చ్చాయో.. ఇంచుమించు అవే మాట‌లు రిపీట్ కావ‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News