తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కుమార్తె వివాహం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి వివాహం ఆంధ్రాకు చెందిన పారిశ్రామికవేత్త సత్యారెడ్డితో నిశ్చయం కావటం తెలిసిందే. ఈ పెళ్లికి ఆంధ్రా.. తెలంగాణ ప్రాంతాలకు చెందిన వివిధ రాజకీయ పక్షాల నేతలు.. సినీ ప్రముఖులు.. వివిధ వర్గాలకు చెందిన వారు హాజరయ్యారు.
గవర్నర్.. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి.. మాజీ ముఖ్యమంత్రితో పాటు..పలువురు హాజరయ్యారు ఇంతమంది ప్రముఖులు హాజరైన ఈ వివాహానికి టీఆర్ ఎస్ కు చెందిన ప్రముఖ నేతలు ఎవరూ కనిపించకపోవటం గమనార్హం. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో రేవంత్ జైలుకు వెళ్లటం.. ఆ సందర్భంగా తనను అరెస్ట్ చేసిన పోలీసులతోనే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను అరెస్ట్ చేయిస్తానంటూ రేవంత్ రెడ్డి మీసం మెలేసి.. తొడ గొట్టటం తెలిసిందే. అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తన కుమార్తె వివాహం సందర్భంగా ఇన్విటేషన్ ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగినా.. ఆయన మాత్రం ఇన్విటేషన్ ఇవ్వలేదు. తనకు కేసీఆర్ తో అంత అనుబంధం లేదని చెప్పటం గమనార్హం. అదే సమయంలో.. టీఆర్ ఎస్ కు చెందిన ప్రముఖ నేతలు ఎవరూ రేవంత్ ఇంట జరిగిన పెళ్లికి వెళ్లకపోవటం చూస్తే.. పిలుపుల విషయంలో విభజనరేఖ స్పష్టంగా కనిపిస్తుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఏపీ విపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పలువురు రేవంత్ రెడ్డి ఇంట జరిగిన పెళ్లికి హాజరయ్యారు. ఏపీలో పార్టీకి ప్రత్యర్థులైన వారు పెళ్లికి రాగా.. తెలంగాణలోని రాజకీయ ప్రత్యర్థుల్ని రేవంత్ ఆహ్వానించలేదన్న మాట వినిపిస్తోంది.