జవాను పాడె మోసిన తెలంగాణ మంత్రి

Update: 2020-12-27 15:00 GMT
దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన తెలంగా జవానుకు ఓ మంత్రి ఘన నివాళులర్పించారు. ఏకంగా పాడెమోసి అతడికి ఘనమైన అంత్యక్రియలు నిర్వహించారు.

జమ్ముకశ్మీర్ లోని లఢఖ్ లో కొండ చిరియలు విరిగిపడి మరణించిన మహబూబ్ నగర్ జిల్లా గుండీడ్ మండలం గువ్వనికుంట తండాకు చెందిన జవాను అంత్యక్రియలు స్వగ్రామంలో అశ్రునయనాల మధ్య జరిగాయి.

ఈ జవాన్ అంత్యక్రియల్లో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి లు ఏకంగా అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏకంగా జవాను పాడెను మోసారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనంగా గాలిలోకి కాల్పులు జరిపారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రూ.25లక్షల ఆర్థిక సాయం, మహబూబ్ నగర్ లో డబుల్ బెడ్ రూం ఇంటిని పరుశురాం కుటుంబానికి అందిస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పరుశురాం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రకటించారు.




Tags:    

Similar News