కాల్వ‌లోకి దిగి గ‌ల్లంతైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ

Update: 2019-11-04 04:23 GMT
తెలంగాణ‌లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పీఏ ఒక‌రు కాల్వ‌లోకి దిగి గ‌ల్లంత‌య్యారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వద్ద గిరీశ్ పీఏగా పనిచేస్తున్నారు. ఆయ‌న ఆదివారం మరో ముగ్గురు స్నేహితులు విజయ్, బాలన్, రామకృష్ణలతో కలిసి అంతర్గాం శివారులో ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌ను చూసేందుకు వెళ్లారు. ఈ క్ర‌మంలోనే గిరీశ్ స‌ర‌దాగా ఈత కొట్టేందుకు కాక‌తీయ‌ కాల్వ‌లోకి దిగాడు.

ఓ వైపు స్నేహితులు వ‌ద్ద‌ని వారిస్తున్నా గిరీశ్ ముందుగా కాల్వ ఒడ్డు నుంచి క్ర‌మ‌క్ర‌మ‌గా లోప‌ల‌కు వెళ్లాడు. అయితే ప్ర‌వాహ ఉధృతి ఎక్కువుగా ఉండ‌డంతో లోప‌ల ఈత కొట్ట‌లేక కొట్టుకుపోయాడు. ప్ర‌వాహ బాగా ఎక్కువుగా ఉండ‌డంతో చివ‌ర‌కు స్నేహితులు సైతం లోప‌ల‌కు వెళ్లే సాహ‌సం చేయ‌లేక‌పోయారు.

సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

మరోవైపు విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే విద్యాసాగ‌ర్‌రావు సైతం పోలీసుల‌ను, గ‌జ ఈత‌గాళ్ల‌ను రంగంలోకి దించారు. పోలీసులు కూడా గజ ఈతగాళ్లతో కలిసి అంతర్గాం, థరూర్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Tags:    

Similar News