టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. ట్విస్ట్ ఇచ్చిన సీఎం కేసీఆర్

Update: 2021-11-16 07:30 GMT
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను టీఆర్ ఎస్ విడుదల చేసింది.  మొత్తం ఆరుగురి అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రకటించారు. నిన్న ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి అనూహ్యంగా కేసీఆర్ అవకాశం కల్పించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రవీందర్‌రావు, వెంకట్రామిరెడ్డి, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, కౌశిక్ రెడ్డిల పేర్లను ప్రకటించింది. వీరంతా మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి రోజు కావడంతో అభ్యర్థులందరూ అసెంబ్లీకి చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందజేశారు.ప్రస్తుతం అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు అక్కడకు చేరుకున్నారు. మరోవైపు ఈ ఆరు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.  నిన్న కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డితో పాటు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు.ఈ ప్రకటన వెలువడకముందే బండ ప్రకాష్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన వెంటనే కేబినెట్‌లోకి తీసుకోనున్నారన్న ప్రచారం జరుగుతోంది.
Tags:    

Similar News