అసద్ విన్నాడో లేడో? వింటే ఎంత ఫీల్ అవుతాడో కదా? మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. హైదరాబాద్ పార్లమెంటు పరిధి.. ముఖ్యంగా పాత బస్తీ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు.. వార్డుల విషయంలో ఎవరు వేలు పెడతానన్నా ఒప్పుకోడు. ఎంత స్నేహమైనా.. పాతబస్తీ బయటనే కానీ.. అందులోకి ఎంటర్ అయ్యేందుకు అవకాశం ఇవ్వడు. ఉమ్మడి రాష్ట్రంలోనూ.. తెలంగాణ రాష్ట్రంలోనూ మొనగాడు నేతలన్నోళ్లు సైతం పాతబస్తీలో తమ పార్టీని పట్టు సాధించే ప్రయత్నం చేయరు. ఒకవేళ చేసినా.. ఫలితం ఉండదన్న ఆలోచనో ఏమో కానీ.. మజ్లిస్ జోలికి వెళ్లేందుకు అస్సలు ఇష్టపడరు.
అందరి మాదిరే కేసీఆర్ కూడా. తెలంగాణలో ఎక్కడైనా ఆయన గులాబీ జెండా రెపరెపలాడేలా చేయగలరేమో కానీ.. మజ్లిస్ పట్టున్న పాతబస్తీలో ఏ మాత్రం కుదరదు. మజ్లిస్ కానీ టీఆర్ ఎస్ కు రాజకీయ ప్రత్యర్థి అయితే.. కేసీఆర్ ప్రత్యర్థులు ఈ విషయాన్ని ప్రశ్నించే వారేమో. కానీ..అసద్ ఆయనకు జిగిరీ దోస్త్. సీఎం పిలవాలే కానీ.. టూవీలర్ మీద నేరుగా ప్రగతి భవన్ కు వచ్చేసే పరిస్థితి.
అలాంటివేళ.. పాతబస్తీలో గులాబీ జెండా ఎగరాలన్న ఆలోచన అస్సలు చేయరు. ఒకవేళ అలాంటి ఆలోచన ఎవరికైనా వస్తే..అదో పాపంగా భావించేవాళ్లకు టీఆర్ ఎస్ లో కొదవ లేదు. ఇదంతా ఎందుకంటే.. మరీ విషయాల్ని మర్చిపోయారో ఏమో కానీ.. టీఆర్ ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య ఒకటి లోక్ సభలో చేశారు.
లోక్ సభ సమావేశాల చివరి రోజున ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీకి ఎన్నికల్లో 11 మంది ఎంపీలను ఓటర్లు కట్టబెడితే ఆ తర్వాత కాలంలో మరో ఇద్దరు అదనంగా చేరారని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకొని కొత్త సభలోకి వస్తామని చెప్పారు. అలవాటులో పొరపాటో.. అసద్ ను మర్చిపోయారో కానీ.. జితేందర్ నోటి నుంచి 17 ఎంపీ స్థానాలు తమవేనని వ్యాఖ్యానించారు. పేరుకు టీఆర్ఎస్.. మజ్లిస్ అన్నవి రెండు పార్టీలే కానీ.. అంతా ఒక్కటేనని.. హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని అసద్ ఖాతాలో వేసే జితేందర్ చెప్పారన్న కవరింగ్ ను కొంతమంది టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ఏది ఏమైనా జితేందర్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయని చెప్పక తప్పదు.