పద్మ పురస్కారాల విషయంలో కేంద్రం ఈసారి తెలుగు రాష్ర్టాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఏపీ నుంచి ఒకరికి ఇచ్చినా, తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. దీంతో తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ వినోద్ దీనిపై కేంద్రానికి లేఖ రాయగా, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో టీఆరెస్ ను తీరును తప్పుపడుతున్నారు.
పద్మ అవార్డుల ఎంపికలో కొన్ని రాష్ట్రాలకే పెద్దపీట వేస్తూ తెలంగాణ సహా పలు రాష్ట్రాలను పట్టించుకోక పోవడంపై ఎంపీ వినోద్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. పద్మ అవార్డులకు నిర్దేశించిన మార్గదర్శకాలకు తగ్గ ప్రతిభ తెలంగాణలో చాలా మంది కవులు కళాకారులకు ఉంది. తెలంగాణ నుంచి ఒక్కరు కూడా అవార్డుకు ఎంపిక కాకపోవడం నిరాశ కలిగించింది. మరికొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇవ్వకుంటే అది మంచి సంప్రదాయం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినా ఎంపిక కమిటీలో పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. పద్మ అవార్డుల ఎంపికలో సమతుల్యత ఉండేలా చూడాలని ప్రధానికి రాసిన లేఖలో ఎంపీ వినోద్ కోరారు.
మరోవైపు ‘పద్మ’ పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటీ రాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ‘పద్మ’ పురస్కారాన్ని అందుకునేందుకు తెలంగాణలో ఒక్కరు కూడా అర్హులు లేరా? అని ప్రశ్నించారు. అసలు తెలంగాణకు ‘పద్మ’ పురస్కారాలు దక్కకపోవడానికి కారణాలేంటో టీఆర్ఎస్ సర్కార్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దుకు - రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని - అంతే కాకుండా - పార్లమెంట్ లో బీజేపీ లేవనెత్తిన ప్రతి అంశానికి టీఆర్ ఎస్ మద్దతు ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ప్రతి అంశానికి ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించే కేటీఆర్ - కవితలు.. ఈ విషయమై ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.