మాజీ మంత్రి, మ‌రో ఎమ్మెల్సీపై అధికార పార్టీ న‌జ‌ర్‌!

Update: 2016-04-25 11:23 GMT
ఒక్కో జిల్లాలో కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటూ వెళ్తున్నటీఆర్‌ ఎస్‌ అధిష్టానం కన్ను నిజామాబాద్ జిల్లాపై పడింది. జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా - మంత్రిగా పనిచేసిన మండవ వెంకటేశ్వరరావును పార్టీలోకి చేర్చుకునేందుకు సీఎం కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దింపారని స‌మాచారం. ఇప్పటికే ఆయన మండవతో మంతనాలు జరిపారని, ఖమ్మంలో జరిగే ప్లీనరీలో చేరాలా? ఆ తర్వాత చేరాలా? అనేది ఇంకా ఫైనల్‌ కాలేదని విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆకుల లలితనూ టీఆర్‌ ఎస్‌ లోకి రప్పించేందుకు ఆ పార్టీకి చెందిన ఓ కీలకనేత మధ్యవర్తిత్వం నడుపుతున్నారని తెలుస్తోంది.

సీనియ‌ర్ నాయ‌కుడిగా పేరున్న మండవ వెంకటేశ్వర్‌ రావు మంచి వ్యూహకర్తగా పేరుంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.మంత్రిగా పనిచేశారు. గతంలో ఒంటిచేత్తో జిల్లాలో తొమ్మిదికితొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించిన ఘనత ఆయన సొంతం. అయితే 2014 ఎన్నిక‌ల త‌ర్వాత ఆయనరాజకీయంగా క్రియాశీలంగా లేరు. అప్పటి నుంచి ఏ రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనటం లేదు. ఇప్ప‌టికే జిల్లాపై సంస్థాగతంగాపట్టుసాధించిన టీఆర్‌ ఎస్‌ రాబోయే ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచిఎదురు లేకుండా చూసుకునేందుకుగానూ మండవపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే మంత్రి తుమ్మల ఇప్పటికే మండవ సమాలోచనలు జరిపినట్టు స్థానికంగా ప్రచారంజరుగుతోంది.

మరోవైపు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆకుల లలితతోనూజిల్లాకు చెందిన టీఆర్ ఎస్‌ కీలక నేత నుంచి ఆహ్వానం అందినట్లుసమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి పేరు ఉండటంతో టీఆర్‌ ఎస్‌ లో చేరేందుకు ఆమె సున్నితంగాతిరస్కరించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేప‌థ్యంలో ల‌లిత చేరిక విష‌యం పెండింగ్‌ లో ప‌డిన‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News