బడా పారిశ్రామికవేత్తకు ఎంత పవర్ ఉంటుందో.. ఆయన సెక్రటరీకి కాస్త కుడిఎడంగా అంతే పవర్ ఉంటుంది. ఒక సీఎంకు ఎంత పలుకుబడి ఉంటుందో.. ఆయన దగ్గరగా పని చేసే వారికి అంతే పవర్ ఉంటుంది. ఇక.. సీఎం వెన్నంటి ఉండే ఇంటి మనుషుల పవర్ ఎంతన్నది కేసీఆర్ జమానాను చూస్తే తెలుస్తుంది. కేసీఆర్ కు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న సంతోష్ ఈ రోజున ఏకంగా ఎంపీ అయిన పరిస్థితి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ ఫుల్ ముఖ్యమంత్రిగా.. రాజకీయ నేతగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చేరుకోవటం.. ఆయన మనసును గెలుచుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆయన ఒకసారి నమ్మితే ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. తేడా వస్తే అంతకంతకూ తానేమిటో చూపిస్తారు.
మిగిలిన ముఖ్యమంత్రులకు పూర్తి భిన్నంగా వ్యవహరించే కేసీఆర్ ను కలవటం.. ఆయన దగ్గరకు వెళ్లటం కొమ్ములు తిరిగిన నేతలకు సైతం కష్టమే. ఇక.. ఆయన వద్దకు వెళ్లి.. తమకు కావాల్సిన పనిని చెప్పి చేయించుకునే ధైర్యం లేదు. ఒకవేళ ఉన్నా.. ఆయన అపాయింట్ మెంట్ దొరకటం సాధ్యమయ్యేది కాదు.
మరి.. ఇలాంటి వేళలో కేసీఆర్ కు నేరుగా కాకున్నా.. పరోక్షంగా అయినా కేసీఆర్ ను కాంట్రాక్ట్ చేసే చానళ్లు సైతం చాలా తక్కువని చెప్పాలి. ఎవరిని దగ్గరకు రానివ్వకపోవటం కేసీఆర్ ప్రత్యేకతగా చెప్పాలి. ఉన్నంతలో మజ్లిస్ అధినేత అసద్ అంటే అంతులేని అభిమానాన్ని ప్రదర్శించే కేసీఆర్.. ఆయన అడిగింది ఏదీ కాదనే పరిస్థితి దాదాపుగా ఉండదని చెబుతారు. అదే సమయంలో అసద్ సైతం తన పరిధిని దాటే ప్రయత్నం చేయరన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
అసద్ తో సంబంధాలు ఉన్న గులాబీ నేతల సంఖ్య తక్కువే. ఆయనతో పరిచయం లేని వారు.. ఆయనతో సిఫార్సులు చేసుకోవటం కష్టం. ఇదిలా ఉన్న వేళ.. గులాబీ నేతలకు మరో చానల్ దొరికిందని చెప్పాలి. ఇటీవల కాలంలో కేసీఆర్ బాగా నమ్ముతున్న విశాఖ శారదా పీఠాధిపతి టీఆర్ ఎస్ నేతలకు కొత్త ఆశగా కనిపిస్తున్నారు. ఏపీ నేతలు.. అందునా ఉత్తరాంధ్రకు చెందిన నేతలతో పావులు కదుపుతున్న పలువురు గులాబీ నేతలు స్వరూపానంద స్వామి సమయం కోసం ఆత్రుత పడుతున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. టీఆర్ ఎస్ నేతలకు స్వరూపానంద పేరుతో తమ కోర్కెల్ని చెప్పుకునే కొత్త అడ్డా దొరికినట్లేనని చెబుతున్నారు. మరి.. ఈ స్వామిని కేసీఆర్ ఎంతకాలం దగ్గరగా ఉంచుతారో చూడాలి.