తెలంగాణలో తిరుగులేని రాజకీయ పక్షంగా అవతరించిందని చెప్పుకునే తెలంగాణ అధికారపక్షానికి ఊహించని షాక్ తగిలింది. తాజాగా జరిగిన సింగిల్ విండో ఎన్నికల్లో ఫలితాలు టీఆర్‌ఎస్‌కు షాక్ తగిలేలా ఉండటం గమనార్హం.
సార్వత్రిక ఎన్నికలు.. ఆనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో తెలంగాణలో తమ పవర్‌కు తిరుగులేదన్నట్లుగా టీఆర్‌ఎస్ నేతలు చెప్పుకునే పరిస్థితి. తాజాగా కరీంనగర్ జిల్లాలోని రెండు సింగిల్ విండోలకు జరిగిన ఎన్నికల ఫలితాలు అధికారపక్షానికి పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు.
కరీంనగర్‌జిల్లాలోని హుస్నాబాద్.. ముల్కనూరు సింగిల్ విండోలకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ అధికారపక్షానికి చెందిన అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఈ రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించటం విశేషం. తెలంగాణలో తమకు తిరుగులేదని చెప్పుకునే టీఆర్‌ఎస్‌కు తాజా ఫలితాలు మింగుడు పడటం కష్టమనే చెబుతున్నారు.