అధికార టీఆర్ ఎస్ సై అంటోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే సిద్ధమంటూ కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం ఎన్నికలకు ఏమాత్రం సిద్ధంగా లేదు. ఆ పార్టీలో కోవర్టుల బెడద ఇప్పుడు పార్టీని తీవ్రంగా దెబ్బతీస్తోందట.. బ్యాక్ బోనుగా ఉంటూ అధికార పార్టీతో లాలూచీ నడుపుతున్న కాంగ్రెస్ నేతల వైఖరి ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోందనే మాట వినిపిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ ను కోవర్టుల బెడద ఓ రేంజ్ లో భయపెడుతోందట..టీఆర్ ఎస్ కు అనుకూలంగా కాంగ్రెస్ లో వ్యవహరిస్తున్న నాయకుల జాబితా ఒకటి రాహుల్ గాంధీకి చేరిందని విశ్వసనీయ సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో ఎవరా కోవర్టులు అనే చర్చ కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది.
తెలంగాణ ఇచ్చినా అధికారంలోకి రాలేకపోయామని తెగ మథనపడుతోన్న కాంగ్రెస్ 2019లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో సొంత కాంగ్రెస్ నేతలే టీఆర్ ఎస్ తో కుమ్మక్కయ్యారనే వార్తలు కాంగ్రెస్ ను షేక్ చేస్తున్నాయి. కాంగ్రెస్ లోనే ఉంటూ వారి వ్యూహాలను ఎప్పటికప్పుడు టీఆర్ ఎస్ కు కొందరు చేరువేస్తున్నారన్నది కొందరు ముఖ్యుల మాట.. అధికార పార్టీని ఎండగట్టే విధంగా ఏ కార్యక్రమం ప్లాన్ చేసినా చివర్లో ఆ క్రెడిట్ పార్టీకి దక్కకుండా కోవర్టులు ఏదో రచ్చ చేసి అది ఫెయిల్ అయ్యేలా చేస్తున్నారన్నది కాంగ్రెస్ లోని ఒక వర్గం గట్టిగా వాదిస్తోంది.
కాంగ్రెస్ లోని తలపండిన నేతతో పాటు మరో ముగ్గురు కూడా టీఆర్ ఎస్ కోవర్టులుగా మారారని పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి రహస్య నివేదికను అందచేసినట్టు ప్రచారం జరుగుతోంది. టీఆర్ ఎస్ కు కోవర్టుగా వ్యవహరిస్తున్న వారు 10 మంది దాకా ఉన్నట్టు వారు గట్టిగా చెబుతున్నారట.. పగలు పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తూ రాత్రి అయ్యేసరికి గులాబీ కండువాలతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారు.
ఇక కోవర్టుల విషయాన్ని లైట్ తీసుకుంటే కాంగ్రెస్ పుట్టి మునగడం ఖాయమని హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.ఇటీవలే కోవర్టుల జాబితాను రాహుల్ గాంధీకి పంపిన కాంగ్రెస్ యువనేత అందుకు గల పక్కా ఆధారాలను సమర్పించినట్టు సమాచారం.
ఇక టీపీసీసీలో మార్పులు - చేర్పులు జరగకపోవడానికి కోవర్టుల ఎపిసోడే కారణమని హైకోర్టు గుర్తించినట్టు చెబుతున్నారు. పదవులు కావాలని కోవర్టులు అడగడంతో టీపీసీసీ విస్తరణను నిలిపివేశాడట రాహుల్ గాంధీ.. పక్కాగా ఆధారాలు సేకరించి టీపీసీసీలో మార్పులు చేర్పులు చేయడంతోపాటు కోవర్టుల సంగతి తేల్చడానికి రాహుల్ గాంధీ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ కోవర్టులకు కాంగ్రెస్ చెక్ పెడుతుందా.? ఇంతకీ ఆ కోవర్టులు ఎవరు అన్నది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.