రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావంతో చాలా రకాలుగా సమీకరణలు మారుతూ ఉంటాయి. ప్రాంతీయ పార్టీలకు జాతీయ ముఖం కంపించదు. వారు రాష్ట్రాలలోనే తన ఉనికిని బలంగా చాటుకుంటూ ఉంటారు. అదే సమయంలో సమాఖ్య వ్యవస్థలో జాతీయ రాజకీయాలు కూడా ముఖ్యంగా ఉంటాయి. దాంతో ఢిల్లీలో ఒక స్టాండ్ తీసుకుంటే గల్లీలో అది ఏ విధంగా ప్రతిబింబిస్తుంది అన్న చర్చ కూడా ఉంటూనే ఉంటుంది.
ఇలాంటి దోస్తీల మీద చాలా కాలం క్రితమే ఒక సామెత పుట్టుకొచ్చింది. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని. ప్రాంతీయ పార్టీల ఇబ్బందికరమైన పరిస్థితులకి ఈ సామెత అద్దం పడుతుంది. ఇక లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే తెలంగాణా రాజకీయాల్లో కాంగ్రెస్ కి బీజేపీకి ఇంతకాలం దూరం పాటిస్తూ వస్తున్న టీయారెస్ ఇపుడు తన న్యూట్రల్ స్టాండ్ ని ఒక్కసారిగా మార్చుకుంది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మీద నేషనల్ హెరాల్డ్ కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈడీ దూకుడు ఇపుడు దేశంలోని విపక్షాలను ఒక్కటి చేశాయి. కాంగ్రెస్ తో విభేదించేవారు కూడా మోడీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను తన రాజకీయ అవసరాలకు పూర్తిగా వాడుకుంటోంది అని విమర్శలు చేస్తున్నాయి. దాంతో ఈ రోజు సోనియాగాంధీ రేపటి రోజున మరో పార్టీ అవుతుంది. కాబట్టి అందరూ కలసి పోరాడాలని నిర్ణయించుకున్నారు.
దాంతో లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే నాయకత్వాన జరిగిన అఖిల పక్ష సమావేశానికి దేశంలోని విపక్షాలు ఇప్పటిదాకా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఉధ్దవ్ థాక్రేకి చెందిన శివసేన, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీ, ఐయూఎంఎ లతో పాటు టీయారెస్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
టీయారెస్ తరఫున ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, సంతోష్ కుమార్ హాజరు కావడం మాత్రం రాజకీయంగా కీలకమైన పరిణామంగానే చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రతిపాదించిందని ఉప రాష్ట్రపతి అభ్యర్ధి మార్గరేట్ అల్వా నామినేషన్ కి దూరంగా ఉన్న టీయారెస్ ఉన్నట్లుండి తన స్టాండ్ మార్చుకోవడం పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. అంతే కాదు మోడీకి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి కాంగ్రెస్ సారధ్యంలో ఉద్యమానికి కూడా మద్దతుగా టీయారెస్ ఎంపీలు సంతకాలు చేయడం విశేషం.
ఇప్పటిదాకా చూస్తే తెలంగాణాలో రెండు జాతీయ పార్టీలతో టీయారెస్ పోరాటం చేస్తోంది. కాంగ్రెస్ టీయారెస్ కి ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి అయితే బీజేపీ ఇపుడు ఎదురు నిలుస్తున్న ప్రతిపక్షంగా ఉంది. మరో వైపు చూస్తే ఈ రెండు పార్టీలకు దూరంగా ఉంటామని, తటస్థ విధానం అవలంబిస్తామని టీయారెస్ ఎపుడూ చెబుతూ వస్తోంది.
అలాంటిది టీయారెస్ కాంగ్రెస్ నాయకత్వాన జాతీయ స్థాయిలో పోరాటానికి సై అంది అంటే తెలంగాణాలో కాంగ్రెస్ సంగతి ఏంటి అన్న చర్చ వస్తోంది. దీని మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయితే కాంగ్రెస్ టీయారెస్ రెండూ ఒక్కటే అని అపుడే ఆరోపణలు చేస్తున్నారు. ఇక తెలంగాణాలో చూస్తే రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా టీయారెస్ మీద పోరాటం చేస్తున్నారు.
ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ లో ఆశలు బాగా పెరిగాయి. ఒక విధంగా కేసీయార్ మీద టఫ్ ఫైట్ చేస్తూ రేవంత్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి చూస్తున్నారు. మరి టీయారెస్ వేసిన ఎత్తుగడ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలసి పోరాటం చేయడం అన్నది కేవలం సిద్ధాంత పరంగా ఉంటుందా లేక రాజకీయంగా కూడా సాగుతుందా అన్నది అయితే ఎవరూ చెప్పలేకపోతున్నారు.
అయితే తెలంగాణా రాజకీయాల్లో బలంగా కాంగ్రెస్ ఈ రోజుకు ఉంది. దానికి రేవంత్ పోరాటం కారణం అని అంటారు. ఈ నేపధ్యంలో జాతీయ స్థాయిలో టీయారెస్ మద్దతు ఎలా ఉన్నా తెలంగాణాలో మాత్రం కాంగ్రెస్ ఈసారి తన అవకాశాలను వదులుకోదు అన్న మాట అయితే ఉంది. అదే విధంగా టీయారెస్ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శిబిరంలో చేరడం అన్నది జాతీయ రాజకీయ యవనికకు పరిమితం అయ్యే విషయంగానే చూస్తున్నారు. మొత్తానికి టీయారెస్ ఎత్తులు ఎలా ఉన్నా తెలంగాణాలో మాత్రం కాంగ్రెస్ దూకుడుకు ఏదీ బ్రేక్ వేయబోదని అంటున్నారు. చూడాలి మరి రానున్న పరిణామాలు ఎలా సాగుతాయో.